మా వాడు .. కాదు మా వాడే..

- - గెలుపోటములపై జోరుగా బెట్టింగులు
- - లెక్కలేసుకుంటున్న సానుభూతిపరులు
- -అభ్యర్థుల్లోనూ అదే ధీమా
- - అభద్రతా భావంలో మరికొందరు..
- - పురపోరు ఫలితాలపై చర్చలు
‘మా వాడే గెలుస్తాడు.. కాదు మావాడే.. చాలెంజ్.. జోలి ఎందుకురా బై నువ్వు ఎంత చాలెంజో చెప్పరాదు.’ ఇప్పుడంతా ఇదే ట్రెండ్ నడుస్తున్నది. బల్దియా ఎన్నికలు ముగియడంతో ఊహాగానాలు, బెట్టింగుల జోరు కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా కొందరు అభ్యర్థులు ఏకంగా మేమే గెలుస్తున్నామంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. రూ.లక్షలు ఖర్చు చేశాం.. అసలు గెలుస్తామో లేదో అన్న సందిగ్ధంలో మరికొందరు ఉన్నారు. మొత్తంమీద బల్దియాల ఎన్నికల ఫలితాలమీద ఉత్కంఠ నెలకొన్నది. ఈనెల 25న
ఫలితాలతో అభ్యర్థుల భవితవ్యం వెల్లడికానున్నది.
- నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ
నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ ఫలితాల కోసం అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే అభ్యర్థులతో పాటు పార్టీల నాయకులు, కార్యకర్తలు సాధారణ జనం సైతం పోలింగ్ సరళి, గెలుపోటములపై ఎక్కడికక్కడ చర్చలు జరుపుతున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమాను వ్యక్తం చేసుకుంటూ బెట్టింగ్‌లు కడుతున్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేయడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన జనం, ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డుల వారీగా గెలుపు, ఓటముల మెజార్టీలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.
నారాయణపేటలో..
నారాయణపేట మున్సిపాలిటీలో ఉన్న 24 వార్డులకు జరిగిన ఎన్నికలు ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య సాగినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మున్సిపాలిటీ ఎన్నికలలో తిరుగులేని ఆధిక్యతతో పలుమార్లు అధికారం చేపట్టిన బీజేపీ కోటను టీఆర్ఎస్ బద్దలు కొట్టడం ఖాయమని పలువురు అభిప్రాయ పడుతు న్నారు. 15 నుంచి 18 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకొని చైర్మన్, వైస్‌చైర్మన్‌తో పాటు మిగిలిన పద వులను కైవసం చేసుకోవడం ఖాయమని టీఆర్ఎస్ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. బీజేపీకి గణనీయమైన స్థాయిలోనే వార్డులు దక్కుతాయని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులూ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పలు వార్డుల గెలుపోటములు, మెజా ర్టీలపై బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కోస్గిలో..
కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో ఉన్న 16 వార్డులలో ఒకటి ఏకగ్రీవం కాగా, మిగిలిన 15 స్థానాలలో ఎన్నికల ప్రచారాలు నువ్వా? నేనా అన్న ట్లుగా సాగాయి. పోలింగ్ రోజునాటికి టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను దక్కించుకోవడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 10 నుంచి 12 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకొని కోస్గి మున్సిపాలిటీపై జెండాను ఎగురవేయడం ఖాయమని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలకే పరమితమవుతుందని భావి స్తున్నారు. రెండు స్థానాలలో స్వతంత్రులు గెలువ వచ్చని ప్రచారం జారుగుతున్నది. పలు వార్డులకు సంబంధించి ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు గొప్పలకు పోకుండా నామమాత్రంగా బెట్టింగులు చేస్తున్నట్లు సమాచారం.
మక్తల్‌లో..
జిల్లాలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలలో ఒక్కటైన మక్తల్‌లో 16 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ వార్డులలో అత్యధిక స్థానాలను టీఆర్ఎస్ గెలుచు కొని పాలక మండలిని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి. 8 నుంచి 10 స్థానాలను టీఆర్ఎస్, 4 నుంచి 5 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని, ఒకచోట కాంగ్రెస్, మరోచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందుతారని ప్రచారం సాగు తుంది. మున్సిపాలటీలో మొదటి అధికారాన్ని టీఆర్ఎస్ శ్రేణులు చేపట్టడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి. ఇక్కడ మున్సిపాల్ చైర్మన్ అభ్యర్థి, మెజార్టీ, తదితర అంశాలపై చర్చలు సాగుతున్నాయి.
మరో రోజు ఎదురుచూపులే..
ఎన్నికల ఫలితాల కోసం మరో రోజూ ఎదురు చూడక తప్పడం లేదు. ఇప్పటికే వార్డుల వారీగా గెలుపోటములకు సంబంధించి అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒక అంచనాకు వచ్చిన ప్పటికీ ఫలితాలు ఊహలకు దూరంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఫలితాల కోసం అభ్యర్థులు, నాయ కులు, కార్యకర్తలు శనివారం వరకు ఎదురు చూడాల్సిందే.
తాజావార్తలు
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30
- సుశాంత్ కేసు.. వెయ్యి పేజీలపైనే ఎన్సీబీ చార్జ్‌షీట్
- రక్షణ బడ్జెట్‌ను పెంచిన చైనా
- గాలి సంపత్ నుండి 'పాప ఓ పాప..' వీడియో సాంగ్ విడుదల
- పాతబస్తీలో ఆకతాయిల బీభత్సం
- అదృష్టమంటే ఇదీ.. బీచ్‌లో నడుస్తుంటే కోట్లు దొరికాయి.. ఎలా?
- ఆకట్టుకుంటున్న మిని సైనా లుక్
- రైల్వే ప్రైవేటీకరణకు ప్రధాని మోదీ కుట్ర: మంత్రి సత్యవతి