ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Jan 24, 2020 , 02:01:29

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
  • - ప్రజాప్రతినిధుల సమావేశంలో జెడ్పీ సీఈవో కాళిందిని


మక్తల్‌ టౌన్‌ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఉపాధ్యాయుల ద్వారా మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో కాళిందిని ప్రజాప్రతినిధులకు సూచించారు. గురువారం మక్తల్‌లోని కన్యకనాపరమేశ్వరి ఫంక్షన్‌హాల్‌లో డీఈవో రవీందర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మక్తల్‌, మాగనూర్‌, కృష్ణ మండలాలకు చెంది న ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కాళిందిని మాట్లాడుతూ ప్రతి పారశాలలో విద్యార్థుల హాజరు వందశాతం ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. గ్రామాలలో అన్ని పాఠాశాలలోని ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరేయ్యేలా కూడా చూడాలని చెప్పారు. విద్యార్థులకు సంబంధించి విద్యా ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎప్పటికప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు పాఠశాలలను పరిశీలించి విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. అనంతరం సమావేశంలో మాట్లాడిన ప్రజాప్రతినిధులు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు సరైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డీపీవో మురళి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్‌ సుధాకర్‌, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ప్రకాశ్‌ పాటిల్‌, ఎంఈవో లక్ష్మీనారాయణ, మక్తల్‌ ఎంపీపీ వనజాదత్తు, కృష్ణ ఎంపీపీ పూర్ణిమ, ఎంపీడీవోలు, అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.VIDEOS

logo