పుర పోరులో ఓటెత్తారు

నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ : జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో బుధవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగిన ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందునుంచే ఓటర్లు పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. పోలింగ్ ముగిసే వరకు నారాయణపేట, మక్తల్, కోస్గి మున్సిపాలిటీలలో మొత్తం 68,647 మంది ఓటర్లకుగాను 74.92 శాతంతో 51,430 మం ది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి లో 34,138మంది పురుషులకు గాను 75.59 శాతం తో 25,872మంది, 34,509 మంది మహిళా ఓటర్లకు గాను 74.06 శాతంతో 25,558 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మక్తల్ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్ ఆయన సతీమణి చిట్టెం సుచరితా రెడ్డి తమ ఓటు హక్కును మక్తల్ వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ ముగియగానే అధికారులు బాక్సులను భద్రతా ఏర్పాట్ల మధ్య జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఈ నెల 25న కౌంటింగ్ జరుగనుంది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అటు అధికారులు, ఇటు అభ్యర్థులు, నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.
మున్సిపాలిటీల వారీగా పోలింగ్ వివరాలు
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలో సగటున 74.92శాతం పోలింగ్ నమోదయ్యింది. నారాయణపేటలో 32,289 మంది ఓటర్లకు గాను 74.9శాతంతో 24,194మంది ఓటర్లు తమ టు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 15933 మంది పురుషులకు గాను 75.6 శాతంతో 12039మంది,16356మంది మహి ళా ఓటర్లలో 74.3 శాతంతో 12155 మంది ఓటు హ క్కును వినియోగించుకున్నారు. మక్తల్ 20,010 మంది ఓటర్లకు గాను 74.23 శాతంతో14855 మంది ఓట్లు వేశారు. వీరిలో 9857మంది పురుషులకుగాను 76.32శాతంతో 7523మంది, 10153మంది మహి ళా ఓటర్లకు గాను 72.21శాతంతో 7332 ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. కోస్గిలో 16,348 మంది ఓటర్లకు గాను 75.73 శాతంతో 12,381 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.వీరిలో 8348మంది పురుషులకు గాను 75.59 శాతంతో 6310 మంది, 8000 మంది మహిళా ఓటర్లకు గాను 75.88శాతంతో 6071మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీలు
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికలను కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ డాక్టర్ చేతన ప్రత్యేకంగా పరిశీలించారు. పోలింగ్ ఆరంభం కాగానే కలెక్టర్ నారాయణపేట, కోస్గి, మక్తల్ మున్సిపాలిటీలలో ఏర్పా ట్లు, ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. పలు చోట్ల అధికారుల పనితీరుపట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ సైతం పలు బూత్ పరిశీలించారు.
స్ట్రాంగ్ రూంలకు చేరిన బాక్సులు
మూడు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ముగియగానే సంబంధిత అధికారులు పోలిం గ్ బాక్సులకు సీల్ వేయించి ప్రత్యేక వాహనాలలో పోలీసుల బందోబస్తు మధ్య జిల్లా కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ఠ్రాంగ్ తరలించారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు పోలింగ్ బాక్సులను ప్రత్యేకంగా పరిశీలంచారు. అనంతరం అధికారులు వాటిని భద్రపరిచి పోలీసుల బందో బస్తును ఏర్పాటు చేసారు. కాగా ఈ నెల 25న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
ఎవరి ధీమా వారిది
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు సంబంధించి జరిగిన ఎన్నికలు ముగిసిన వెంటనే లెక్కలు వేసుకునే పనిలో నిమ గ్నం అయ్యారు. తమ తమ అనుచరులు చెప్పే వివరాలతో గెలుపోటములను అంచనా వేసుకుంటున్నారు. పార్టీల ముఖ్య నాయకులు సైతం పోలింగ్ విశ్లేషణలు నిర్వహంచారు. కాగా మూడు మున్సిపాలిటీలలో టీఆర్ జెండా ఎగరడం ఖాయం అన్న ధీమా అన్ని వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
తాజావార్తలు
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం