ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 23, 2020 , 03:04:59

ప్రశాంత వాతావరణంలో పుర ఎన్నికలు

ప్రశాంత వాతావరణంలో పుర ఎన్నికలునారాయణ పేట, నమస్తే తెలంగాణ/నారాయణపేట రూరల్ : జిల్లాలో బుధవారం జరిగిని పుర ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయని ఎస్పీ డాక్టర్ చేతన అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలతో పాటు, కోస్గి, మక్తల్ పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించినట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలతో ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారని, పటిష్టమైన బందోబస్తూ మధ్య ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పో లింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళిపై మహిళలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్ వాహనాలు ఎప్పటికప్పుడు తమ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించినట్లు ఆమె వెల్లడించారు. అంతకు ముందు పేట పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాల, మార్కెట్ లైన్ ఉన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాలలో అధికారులను పోలింగ్ సరళిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్, మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు అందించారు. బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ విధానాన్ని ఆయన పరిశీలించారు. ఆయా కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

కోస్గిలోని పోలింగ్ కేంద్రాలను..

కోస్గి/కోస్గి టౌన్ : కోస్గి మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్పీ చేతన స్వయంగా పరిశీలించారు.   పట్టణంలోని11, 12, 14, 15, 16 వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఉర్దూ మీడియం పాఠశాల, పోతిరెడ్డిపల్లి గ్రామంలో 1,2వ వార్డులకు చెందిన పోలింగ్ కేంద్రాలను ఆమె పరీశీలించారు. ఈ సందర్భంగా  ఎస్పీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చెయ్యాలని స్థానిక పోలీసు సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లతో మాట్లాడుతూ స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసి బందోబస్తు వివరాలను సీఐ ప్రేమ్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగిసే వరకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ పూర్తి రక్షణ కల్పించాలని ఆయా పోలింగ్ కేంద్రాల ఎస్సైలను ఎస్పీ ఆదేశించారు.


VIDEOS

logo