శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 22, 2020 , 05:16:01

నేడే పుర పోలింగ్

నేడే పుర పోలింగ్


నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని మూడు మున్సిపాలిటీల ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. నిఘానీడలో, పోలీసుల బందోబ స్తు మధ్య ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం నుంచే ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన మున్సిపాలిటీలకు ఎన్నికల సామగ్రితో బయలుదేరి వెళ్లారు.

55వార్డులు.. 211 మంది అభ్యర్థులు

జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో 56 వార్డులు ఉండగా ఒక స్థానం ఏకగ్రీవం కావడంతో 55 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నారాయణ పేటలోని 24 స్థానాలకు గాను 80 మంది అభ్యర్థులు, మక్తల్ స్థానాలకు గాను 65 మంది అభ్యర్థులు, కోస్గిలో 16స్థానాలకు ఒక స్థానం (10వ వార్డు) ఏకగ్రీవం కాగా మిగిలిన 55 స్థానాలకు 66 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరందరు ఒకరిని మించి మరొకరు ప్రచారాలు పూర్తి చేసుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

110 పోలింగ్ బూత్

జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో అధికారులు ఎన్నికల సంఘం ఆదేశానుసారం మొ త్తం110 పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. నారాయణ పేటలో 24 వార్డులలో 48, మక్తల్ 16వార్డులలో 32, కోస్గిలో ఎన్నికలు జరిగే 16 వార్డులలో 30 బూత్ ఏర్పాటు చేశారు.

జిల్లాలో 69,582 ఓటర్లు

జిల్లాలో బుధవారం జరిగే ఎన్నికలో మొత్తం 69,582మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. నారాయణపేటలో అత్యధికంగా 3755మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 17,323 మంది మహిళా ఓటర్లు ఉండగా, 20, 028 మంది పురుషులు ఉన్నారు. అత్యధికంగా 10వ వార్డులో1682 మంది ఓటర్లు ఉం డగా అత్యల్పంగా 10వ వార్డులో 1081 మంది ఓట ర్లు ఉన్నారు. మక్తల్ 20,028 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో స్త్రీలు10162మంది, పురుషులు 9866 మంది ఉండగా అత్యధికంగా 2వ వార్డు లో1502 మంది, అత్యల్పంగా 1వ వార్డులో 844 మంది ఓటర్లు ఉన్నారు. కోస్గి లో17,323 మంది ఓటర్లలో 8,548మంది మ హిళా ఓటర్లు, 8,775 పురుష ఓటర్లు ఉన్నారు. 12 వార్డులోఅత్యధికంగా 1237 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా 3వ వార్డులో898 మంది ఉన్నారు.

500 మంది సిబ్బంది

జిల్లాలోని మూడు మన్సిపాలిటీకు జరుగుతు న్న ఎన్నికల నిర్వహణకు గాను మొత్తం 500 మంది సిబ్బందిని నియమించారు. ముగ్గురు జిల్లా అధికారులను మానిటరింగ్ అధికారులుగా నియమించారు. 210మంది పీవోలు, 210 మం ది ఏపీవోలు, 25మంది వెబ్ 17 మంది మైకో అబ్జర్వర్లను నియమించారు. వీరికి కలెక్టర్ సారథ్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వ హించి బాధ్యతలు అప్పగించారు.

జిల్లాకు అదనపు బగాలు

జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో జరుగుతున్న ఎన్నికల బందోబస్తుకు అదనపు బలగాలను రప్పించారు. ప్రతి మున్సిపాలిటీలోను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రతి మున్సిపాలిటీలోను 100మందికి తగ్గకుండా పోలీసు సిబ్బందిని నియమించారు. మూడు మున్సిపాలిటీలలో డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించనున్నారు. ఇందుకోసం దాదాపుగా 1000 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ప్రతి మున్సి పాలిటీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. సమస్యాత్మకంగా ఉన్న నారాయణపేటలోని 2 కేంద్రాలు, మక్తల్ 7 కేం ద్రాలు, కోస్గిలోని 4 కేంద్రాలలోఅదనపు సిబ్బందితో  భద్రతా ఏర్పాట్లు చేశారు.

పోలింగ్ కేంద్రాలకు తరిన సామగ్రి

ఎన్నికల సామగ్రిని ఎన్నికల సిబ్బంది మంగళవారం తరలించారు. ఉదయం నుంచే వారికి కేటాయించిన స్థానాలకు ఎన్నికల సామగ్రిని తీసుకొని పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ స్టేషన్లకు వెళ్లారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకట్రావు  పరిశీలించారు.

పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసాం. ఇప్పటికే సిబ్బందికి పలుమార్లు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిం చాం. మంగవారం అన్ని కేంద్రాలకు సామగ్రిని చేరవేయడం జరిగింది. గతంలో నిర్వహించినట్లుగానే ఈ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తాం.  
- ఎస్ వెంకట్రావు, కలెక్టర్ నారాయణపేట జిల్లా

VIDEOS

logo