శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 22, 2020 , 05:15:29

మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


నారాయణపేట రూరల్ : నేడు జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రత్యేకాధికారి చీర్ల శ్రీనివాసులు, మున్సిపల్ ఇన్ కమిషనర్ సందీప్ తెలిపారు. పేట మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో 48 మంది పీవోలు, 48 మంది ఏపీవోలు, 124 మంది ఓపీవోలను నియమించడంతో పాటు అదనంగా నలుగురు పీవో లు, నలుగురు ఏపీవోలు, 15 మంది ఓపీవోలను రిజర్వులో ఉంచినట్లు చెప్పారు. ఈ పోలింగ్ కేంద్రాల పరిశీలనకు గాను 6 రూట్లు ఏర్పాటు చేసి 6గురు జోనల్ ఆఫీసర్ నియమించినట్లు వారు ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని పరిశీలించనున్నట్లు వారు తెలిపారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద మంగళవారం ఆయా పో లింగ్ కేంద్రాలకు సంబందించి సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ వెంకట్రావులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పోలింగ్ సిబ్బందిని ప్రత్యేక వాహనాలలో వారి వారి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 


VIDEOS

logo