మంగళవారం 09 మార్చి 2021
Narayanpet - Jan 22, 2020 , 05:14:21

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలి

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలి


నారాయణపేట నమస్తే తెలంగాణ : జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో  జరుగునున్న ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ డాక్టర్ చేతన అన్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పట్టణంలోని శీలా గార్డెన్స్ జిల్లాలోని పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ చేతన మాట్లాడారు. జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు హాజరవుతున్న పోలీసు అధికారులు, సిబ్బందికి పోలింగ్ రోజున తీసుకోవలసిన విధుల గురించి పలు సూచనలు చేశారు.

ఎవరికి అప్పగించిన వి ధులు వారు బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన వారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్నికల విధులలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేట, మక్తల్, కోస్గి మున్సిపాలిటీలలో జరిగే ఎన్నికలకు సంబంధించి సుమారు 600 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. 100 మందికి పైగా అదనపు పోలీసు బలగాలతో పాటు స్పెషల్ పార్టీలు, ైస్ట్రెకింగ్ ఫోర్స్, మొబైల్ పార్టీలు ఏర్పాటు చేశామన్నారు.

ఈ సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ రావు, సీఐలు సంపత్ శంకర్, ప్రేమ్ ఇఫ్తేకార్ అహ్మద్, ఎస్సైలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


VIDEOS

logo