ష్..!

- - మూగబోయిన ప్రచార మైకులు
- - ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థుల పాట్లు
నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెంగాణ : ష్.. ష్.. ష్.. నిశబ్దం.. గత వారం రోజులుగా జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో జరిగిన ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు. మైకుల శబ్దాలు సోమవారం సాయంత్రం ఒక్కసారిగా నిలిచి పోయా యి. ఎన్నికల సంఘం ముందస్తు షెడ్యూలు ప్రకారం బుధవారం ఎన్నికలు జరగవలసి ఉం డడంతో ప్రచార ఘట్టం పరి సమాప్తమయ్యిది. ఎన్నికలకు మరో రోజు మాత్రమే ఉండడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఓటరు దేవుళ్లును ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది అభ్యర్థులు నగదు, కానుకలు రహస్యంగా సమర్పించుకుంటున్నారు.
జోరుగా సాగిన ప్రచారాలు..
వారం రోజులుగా ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగాయి. నారాయణపేట మున్సిపాలిటీలో ఉన్న 24 వార్డులకుగాను 80మంది అభ్యర్థులు, మక్తల్‌లో16 వార్డులకు గాను 65మంది అభ్యర్థులు, కోస్గిలో16వార్డులకు గాను 60మంది అభ్యర్థులు రంగంలో ఉండి ప్రచారం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచి కొందరు, వచ్చిన తరువాత మరికొందరు ప్రచారాలకు శ్రీకారం చుట్టారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు. అనంతరం కొంత మంది ప్రధాన పార్టీల టికెట్లు లభించక, మరికొందరు పరిస్థితులకు భయపడి పోటి నుంచి తప్పుకోవడంతో మిగిలినవారు ప్రచారాలను ఆరంభించారు. టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డిలు ప్రతి రోజు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి మరింతగా తీసుకెళ్లారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బండ ప్రకాశ్, మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి తదితరులు కూడా హాజరై ప్రచారాలు నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల తరపున ప్రచార కార్యక్రమాలు సాగించారు.
అంతా గప్..చుప్..
ఎన్నికల ప్రచార సమయం సోమవారం సాయం త్రం 5గంటలకు ముగియడంతో జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో నిశబ్ద వాతావరణం నెలకొంది. ఉద యం నుంచి రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్త లు, అనుచరగణంతో కలిసి అభ్యర్థులు మరింత ఉత్సాహంగా ప్రచారాలు చేశారు. పోటాపోటిగా ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు చేశారు. చివరి నిమిషం వరకు ప్రచారాన్ని హోరెత్తించారు.
గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
ప్రచారాలు ముగియడంతో ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ప్రచారాలు జోరుగా చేశాం.. ప్రభుత్వ పథకాలు మాకు అండగా ఉన్నాయి.. మంత్రి, ఎమ్మెల్యేల ప్ర చారాలు మాకు కలిసి వస్తాయన్న ధీమాతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ప్రచారాలు చేసాం, కానుకలు ఇస్తున్నాం మా పార్టీల నాయకులు ప్రచారాలు చేశారు. మాకు కలిసి వస్తుందనే నమ్మకంతో కాంగ్రెస్, బీజేపిల అభ్యర్థులు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు సైతం గెలుపుపై నమ్మకంతో ఓటర్లను మరింతగా మెప్పించే పనులలో ఉన్నారు. సోమవారం నాటికి పరిస్థితును అంచనా వేసి వ్యూహాలను రచించుకుంటున్నారు.
తాజావార్తలు
- ప్రయాగ్‌రాజ్-బిలాస్పూర్ మధ్య రేపు విమాన సర్వీసు ప్రారంభం
- హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించండి.. బీసీసీఐని కోరిన కేటీఆర్
- ఆ నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట: ప్రధాని
- రామన్ ఎఫెక్ట్‌కు 93 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
- ఫుడ్ కార్పొరేషన్లో ఏజీఎం పోస్టులు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్‌పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!