ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 21, 2020 , 01:59:08

మక్తల్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌దే గెలుపు

మక్తల్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌దే గెలుపు

మక్తల్‌ టౌన్‌ : మక్తల్‌ మున్సిపాలిటీ లో టీఆర్‌ఎస్‌ పార్టీదే గెలుపు అని మక్త ల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి  పే ర్కొన్నారు. సోమవారం మున్సిపల్‌ ఎ న్నికల ప్రచారానికి చివరి రోజు కావడం తో ఎమ్మెల్యే పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. మొదట అబివృద్ధిలో భా గంగా మక్తల్‌ మున్సిపాలిటీలో విలీనం చేసిన 8వ వార్డుకు చెందిన గార్లపల్లి, 6వ వార్డుకు  చందాపురంతో పాటు నేతాజీనగర్‌, బీసీ కాలనీ, కేశవనగర్‌, కాలేజీరోడ్‌, బురాన్‌గడ్డలతో విస్తృతం గా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మా ట్లాడుతూ మక్తల్‌ పట్టణం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తేనే సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వీధి దీ పాలు, తాగునీరు తదితర సమస్యలు టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే పరిష్కారం అవుతు న్నాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అలాగే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులు, కార్మికులు, పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, ఆ పథకాలతో లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించేందుకు సిద్ధం గా ఉన్నారు.

ముఖ్యంగా సంగంబండా రిజర్వాయర్‌ ద్వారా మక్తల్‌లోని పెద్ద చెరువు, తిర్మల చెరువును నింపుకున్నామని వీటి ద్వారా మక్తల్‌లో సాగునీటి సమస్య తీరిందని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే బీసీ కాలనీలో 500 డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు పంచుతామని, అలా గే మక్తల్‌ అభివృద్ధికి మొదటి విడతగా రూ.6 కోట్లు నిధులు మంజూరయ్యాయని వీటితో ప్రతి వార్డులో కమ్యూనిటీ హాల్స్‌, షాదీఖానా, టౌన్‌ హాల్‌ పనులు చేపడతామన్నారు. అలాగే మ క్తల్‌ పట్టణంలో డిగ్రీ కళాశాను ఏర్పాటు చేయడంతో పాటు పార్కును కూడా నిర్మిస్తామని అందుకే ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ నరసింహగౌడ్‌, శ్రీనివాస్‌గుప్తా, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి  , పసుల విష్ణువర్ధన్‌రెడి,్డ అన్వర్‌, అస్గర్‌, వెంకటమ్మ, కావలి అంజి, నేతాజీ, ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నాదే  : పట్నం

కోస్గి : కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులలో కారు గుర్తుపై పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిని పెద్ద మనస్సుతో మీ ఓటు వేసి గెలిపించాలని.. మీ వార్డులలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించడం నా బాధ్యత అని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం కోస్గి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే ఆయా వార్డులలో నెలకొన్న సమస్యలను గుర్తించామని, అన్నింటినీ త్వరలో పరిష్కరించడంతో పాటు కోస్గి మున్సిపాలిటీని ఆదర్శ ము న్సిపాలిటీగా తీరిదిద్దుతామని హామీ ఇచ్చారు. కోస్గిలో ఇప్పటికే రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని, మంత్రి కేటీఆర్‌ మరో రూ.15 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఈ నిధులతో కోస్గి పట్టణాన్ని సుందరంగా మారుస్తామని ఆయన వెల్లడించారు. మీరు చేయాల్సిందల్లా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి పార్టీకి అండగా నిలవాలని, మీ వెన్నంటే మేముంటామని ఆయన ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

VIDEOS

logo