శుక్రవారం 05 జూన్ 2020
Narayanpet - Jan 20, 2020 , 02:42:22

అభివృద్ధి చేశాం.. ఓట్లు అడుగుతున్నాం

 అభివృద్ధి చేశాం.. ఓట్లు అడుగుతున్నాం
  • - కులాలు, మతాలతో రాజకీయాలు.. టీఆర్‌ఎస్‌ సిద్ధాంతం కాదు
  • - మున్సిపాల్టీలలో గులాబీ జెండా ఎగురేద్దాం.. మరింత అభివృద్ధి సాధించుకుందాం
  • - రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ : ఆరేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 60 ఏళ్ల దరిద్య్రాన్ని దూరం చేసేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని, ప్రతి ఇంటికీ లాభం, ప్రతి కుటుంబంలోనూ ఆనందాలు నింపిందని, అందుకే మున్సిపల్‌ ఎన్నికల్లో సగర్వంగా ఓట్లు అడుగుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వీ శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం సాయంత్రం జిల్లాలోని మక్తల్‌, నారాయణపేట, కోస్గిలలో జరిగిన ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యారు. మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ, నారాయణపేటలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన భారీ సభ, కోస్గిలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశాలలో మంత్రి మాట్లాడారు. 60 సంవత్సరాలు పాలించిన గతంలోని ప్రభుత్వాలు పట్టించిన దారిద్య్రం వదిలేలా సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ప్రజల కష్టాలు, కన్నీళ్లను తుడిచే విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. పుట్టిన బిడ్డ నుంచి మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుల వరకు మేలు చేసే విధంగా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. ప్రతి ఇంటికీ లాభం జరిగిందన్నారు. ప్రజలకు పాలన మరింత చేరువ కావడానికి నూతన జిల్లాలు, మండలాలు, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు జరిగిందన్నారు.

ఈ క్రమంలో ప్రజలందరికీ సీఎం కేసీఆర్‌  ఓ ధర్మాత్మునిలా అండగా నిలిచి అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. ఈ పథకాలతో అందరి జీవితాలలో వెలుగులు నిండుతున్నాయన్నారు. అందుకే మున్సిపాల్టీ ఎన్నికల్లో సగర్వంగా  ఓట్లు అడుగుతున్నామని చెప్పారు.  గతంలోనూ, ఇప్పుడు కూడా కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేసే వారు ఎన్నికలలో లబ్ధి పొందాలని వస్తున్నారన్నారు. వరుసగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ధోరణి మార్చుకోకుండా మళ్లీ వస్తున్నారని వారి గూవ్వగుయ్‌ మనిపించేలా ఈ ఎన్నికలలో తీర్పు నివ్వాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మోసం మాటలు చెప్పే అవసరం తమకు లేదన్నారు. అభివృద్ధి చేశాం. ఓట్లు అడుగుతున్నామని  మంత్రి వివరించారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మన బతుకులను బాగు చేసుకోవడం కోసం టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. అభ్యర్థుల ముఖాలను నచ్చకుంటే కారును చూసి ఓట్లు వేయాలని మంత్రి కోరారు.

నారాయణ పేట జిల్లాకు సైనిక్‌ స్కూలును సాధించి తీరుతామని ఎం పీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపించడం వల్ల అభివృద్ధి కుంటు పడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధిని మరింతగా సాధించుకుందామన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి బండి సజావుగా సాగాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే కౌన్సిలర్లుగా గెలిపించాలన్నారు. పారిశ్రామికంగా, పర్యాటక కేంద్రంగా సీఎం, మంత్రుల సహకారంతో అభివృద్ధి చేసుకుందామన్నారు. మక్తల్‌  ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి  చిట్టెం నర్సిరెడ్డి కలను నిజం జేసేలా సాగునీరు సాధించి ఈప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకున్నామన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీని మరంత అభివృద్ధి పరిచేందుకు అన్ని స్థానాలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమాలలో జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, శాట్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇందిర, విఠల్‌ రావు ఆర్య, నరసింహాగౌడ్‌, మూడు మున్సిపాలిటీల అభ్యర్థులు పాల్గొన్నారు.logo