ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 20, 2020 , 02:41:28

జోరుమీదున్న కారు

జోరుమీదున్న కారు


నారాయణపేట ప్రతినిధి/ నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో కారు జోరు మీదున్నది. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో విపక్షాలకు అందకుండా ప్రజల  ఆదరాభిమానాల తో పరుగులు తీస్తున్న టీఆర్‌ఎస్‌ కా రు మరో మారు  మున్సిపల్‌ ఎన్నికల లో తన జోరును చూపబోతున్నది. గతం లో ఎన్నడూ లేని విధంగా పట్టణ ఓట ర్లు టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీతో మున్సిపల్‌ చైర్మన్‌ గిరిని కట్టబెట్టడానికి సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రక్రియ ఆరంభమైన రోజు నుంచి ప్రజలు వారంతకు వారుగా టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయడం ద్వారానే తమకు తమ భవిత వ్యం బాగుంటుందని భావించి అందుకు  అనుగుణం గా జిల్లాలోని నారాయణపేట, మక్తల్‌, కోస్గి, మున్సిపాల్టీలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బాసటగా నిలుస్తున్నా రు. పార్టీ తరుపున నిర్వహించే ప్రచార కార్యక్రమాలలో ప్రజలే స్వయంగా  తరలి వచ్చి పాల్గొంటుండడం, పలువురు ప్రముఖులు మున్సిపాల్టీలలో విస్తృతం గా పర్యటించి ప్రచారాలు చేయడంతో అభ్యర్థుల విజయాలు సునాయసం కానున్నాయి.

ప్రతిష్ఠాత్మకంగా మున్సిపల్‌ ఎన్నికలు 

మున్సిపాల్టీల ఎన్నికలను జి ల్లా ఎమ్మెల్యేలు ప్రతిష్ఠాత్మకం గా తీసుకున్నారు. నారాయణపేటలో రాజేందర్‌రెడ్డి, మక్తల్‌ లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కో స్గిలో పట్నం నరేందర్‌రెడ్డి ము న్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ముందుకెళ్తు న్నారు. అన్నిస్థానాలలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచేలా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తూ ఉ త్సాహంగా ప్రచారం చేశారు. ఒక రకం గా వారు పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల కన్నా మున్సిపల్‌ ఎన్నికలను మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి వారి తరపున ప్ర చార కార్యక్రమాలను నిర్వహించి గడప గడపకు వెళ్లి  ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురిం చి వివరించారు. వారి గెలుపుకోసం అహర్నిశలు కృషి చేసి మున్సిపాల్టీలలో అన్ని స్థానాలలోనూ విజయం సాధించేలా చ ర్యలు చేపట్టారు. పార్టీ శ్రేణులను సైతం ఏకతాటిపైకి నడిపించడంలో  ఎమ్మెల్యేలు సక్సెస్‌ కావడంతో ఎన్నికలు ఏకపక్షంకానున్నాయి.

మరింత ఊపు నిచ్చిన మంత్రి, మాజీ మంత్రుల ప్రచారం

జిల్లాలోని మూడు మున్సిపాల్టీలు, ఎమ్మెల్యేలు, పా ర్టీ నాయకులు, కార్యకర్తలకు తోడుగా రాష్ట్ర ఎక్సైజ్‌ శా ఖ మంత్రి డాక్టర్‌ వీ శ్రీనివాస్‌గౌడ్‌,  ఎంపీ మ న్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్‌ సీ లక్ష్మారెడ్డి, జెడ్పీ చై ర్‌పర్సన్‌ వనజ తదితర ప్రముఖులుచేసిన ప్రచారాలు పార్టీ శ్రేణులకు మరిం త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ప్రభుత్వ పథకాలతో పాటు విపక్షాల కుట్రలను తిప్పి కొడుతూ వారు చేసిన ప్రసంగాలు ప్రజలను అమితంగా ఆకట్టుకోవడంతోపాటు ఆలోచింపజేయడం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు, పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని, ఊపును ఇచ్చాయి.

ప్రజలను మెప్పించడంలో విఫలమైన ప్రతిపక్షాలు

ప్రజలనుమెప్పించడంలో ప్రతిపక్ష పార్టీలు  పూర్తిగా విఫలమయ్యాయి. మూడు మున్సిపాల్టీలలోనూ పలు స్థా నాలలో అభ్యర్థులు  దొరకక కొన్ని స్థా నాలను వ దులుకున్నారు.  పలు చోట్ల కాంగ్రెస్‌, బీజేపీలు నామమాత్రంగా అభ్యర్థులను నిలపడం తప్పవారి తరపున ప్రచారం చేసే నాయకులే లేరు. ప లువురు బీజేపీ, రాష్ట్ర, జాతీయ నాయకులు మక్తల్‌, నారాయణపేటలలో  ప్రచారం చేసేందుకు వచ్చిన ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో  వచ్చా మా..  వెళ్లామా.. అన్నట్లుగా వారి కార్యక్రమాలు జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారం చేసే ముఖ్య నాయకులే లేరంటేఆ పార్టీ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రజలు ఇప్పటికే  ఒక అంచనాకు వచ్చారు.

నేటితో ముగియనున్న ప్రచారం

 ప్రచార కార్యక్రమాలు సోమవారం సాయంత్రం తో ముగియనున్నాయి. 22న ఎన్నికలు జరగనుండడంతో అభ్యర్థులందరూ ప్రచార కార్యక్రమాలను మరింత వేగంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. సోమవారం ఉదయం నుంచే ప్రచా ర కార్యక్రమాలను మరింత వేగం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు సైతం వారి వారి మున్సిపాల్టీలలో ప్రచార కార్యక్రమాలను చివరి రోజు భారీగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.


VIDEOS

logo