మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Jan 19, 2020 , 01:29:09

కోస్గిని టాప్‌లో నిలుపుతా..

కోస్గిని టాప్‌లో నిలుపుతా..


కోస్గి : గత పాలకుల హయాంలో కోస్గి ప్రజలు తాము ఆశించిన అభివృద్ధి జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురైయ్యారు. వారి పనితీరుపై విరక్తి చెంది టీఆర్‌ఎస్‌ పార్టీని గెలించారని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. నేడు టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కోస్గి పట్టణం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నదని, ప్రస్తుతం జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కడితే కోస్గి రూపురేఖలే మారుస్తామని ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

నమస్తే తెలంగాణ : నియోజకవర్గంపై మీకున్న పట్టు ను ఎలా నిలుపుకుంటారు ?

ఎమ్యెల్యే పట్నం : గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కోస్గి పూర్తిగా వెనుకబడి పోయింది. దీంతో వారి నిర్లక్ష్యాన్ని ఎండగట్టి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సారథ్యంలో కొడంగల్‌ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేశాం. ఈ క్రమంలో సర్పంచ్‌, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారు. అదే ఫలితం మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పునరావృత్తం అవ్వడం ఖాయం.

కొత్తగా ఏర్పడిన కోస్గి మున్సిపాలిటీ అభివృద్ధికి మీకున్న ప్రణాళికలు ఏమిటీ..?

కనీసం సౌకార్యాలు లేక తీవ్రమైన ఇబ్బందుల మధ్య కొట్టు మిట్టాడుతున్న కోస్గిని పరిశీలించి మున్సిపాలిటీగా మారిస్తే తప్పా అభివృద్ధి చెందదని భావించి ప్రభుత్వానికి కోస్గిని మున్సిపాలిటీగా మార్చాలని కోరాం. ప్రభుత్వం  కూడా కోస్గిని మున్సిపాలిటీగా ప్రకటించిం ది. ఆ వెనువెంటనే కోస్గి అభివృద్ధికి ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయడంతోపాటు వాటితో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం. మంత్రి కేటీఆ ర్‌ మరో రూ.15 కోట్లు కోస్గి అభివృద్ధికి ఇస్తామని హామీ ఇచ్చారు. వీటితో కోస్గిని మరింత అభివృద్ధి చేస్తాం. 

కోస్గి ప్రజల చిరకాల వాంఛ అయిన కోస్గి బస్‌డిపో ఎప్పుడు పూర్తి చేస్తారు..?

ఇప్పటికే బస్‌డిపో షెడ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరి కొన్ని షెడ్ల నిర్మాణాలతో పాటు ప్రహరీని ఏర్పాటు చేసి ముందుగా 50 బస్సులతో డిపోను ఏర్పాటు చేయించేందుకు నిర్ణయించాం. మంత్రి కేటీఆర్‌ సూచ నలతో అతి త్వరలో ప్రతి గ్రామానికి బస్సులను నడిపించి కోస్గి బస్‌ డిపో సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.

కోస్గిలో ప్రభుత్వ దవాఖాన విస్తరణ, పట్టణ రహదారుల విస్తరణ పనులు, నూతన మున్సిపల్‌ కార్యాల య భవన నిర్మాణాలు ఎప్పుడు పూర్తి చేస్తారు?

కోస్గికి మంజూరైన రూ.15 కోట్లతో పట్టణంలో సీసీ రోడ్లు, రోడ్డు విస్తరణ పనులు నిర్వహిస్తున్నాం. అలాగే కూరగాయ మార్కెట్‌ను సైతం ఆధునిక హంగులతో ని ర్మిస్తున్నాం. త్వరలోనే మున్సిపల్‌ కార్యాలయాన్ని కూడా నిర్మిస్తాం.

కోస్గి మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు మీకున్న మేనిఫెస్టో ఎలా ఉంది ?

కోస్గి అభివృద్ధి కోసం మేనిఫెస్టోను ఇదివరకే విడుదల చేశాం. కోస్గికి బస్‌ డిపో ఏర్పాటుతోపాటు 50 పడకల దవాఖాన, కూరగాయ మార్కెట్‌, డిగ్రీ కళాశాల ఏర్పా టు, కోస్గి బస్టాండ్‌ ఆధునీకరణ, పట్టణంలోని అన్ని రోడ్లను సీసీగా మార్చడం, మురుగు కాల్వల నిర్మాణం, మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్‌, మినీ స్టేడియ, మినీ పార్కు ఏర్పాటుతోపాటు మరిన్ని అభివృద్ధి పనులు నిర్వహించేందుకు ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి  జాగ్రత్తలు తీసుకున్నారు?

కోస్గి మున్సిపాలిటీ పరిధిలో టీఆర్‌ఎస్‌ పార్టీలో భారీ స్థాయిలో నాయకులు పోటీ పడ్డారు. వీరిపై క్షేత్రస్థాయి లో ప్రత్యేక సర్వే చేయించి అర్హులైన వారికి, అన్ని వర్గా ల వారికి పాత్రినిధ్యం కల్పించి బీఫారాలు అందజేశాం.

మీ పార్టీ  గెలుపునకు దోహదపడే అంశాలేవి..?

సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మా పార్టీ అభ్యర్థుల గెలుపునకు దోహదపడతాయి. బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 450 పథకాలలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో లబ్ధిపొందిన వారే ఉన్నారు. అందుకే వారు టీఆర్‌ఎస్‌ పార్టీని తమ సొంత పార్టీగా భావించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.

కోస్గిలోని 16 వార్డులలో మీరు ఎన్ని వార్డులు దక్కించుకుంటారు ?

కోస్గి పట్టణంలోని 16 వార్డులకు మొత్తం 16 వార్డులను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంటుంది. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఆ అభివృద్ధి టీఆర్‌ఎస్‌ చేస్తుందని నమ్ముతున్నారు కాబట్టి వందకు వందశాతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించడం ఖాయం.


VIDEOS

logo