మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Jan 19, 2020 , 01:23:51

రేవంత్‌రెడ్డి.. గారడీ మాటలు మానుకో..

రేవంత్‌రెడ్డి.. గారడీ మాటలు మానుకో..
  • - కేసీఆర్‌, కేటీఆర్‌ను విమర్శించే అర్హత నీకు లేదు
  • - ప్రజలు తరిమి కొట్టినా.. నీకు ఇంకా బుద్ధి రాలేదు
  • - విలేకరుల సమావేశంలో ఎంపీ బండ ప్రకాశ్‌
  • - ఎన్నికల సమయంలోనే రేవంత్‌ ప్రత్యక్షం
  • - కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కోస్గి : నీ నోటి దురుసు వల్లే కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలు నీకు ఉద్వాసన పలికారని, ఇంకేంత కాలం గారడి మాటలు చెబుతావని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై ఎంపీ బండ ప్రకాశ్‌, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిలు మండి పడ్డారు. శనివారం కోస్గిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యు లు బండ ప్రకాశ్‌ మాట్లాడుతూ గారడి మాటలతో నిత్యం పబ్బం గడుపుకునే రేవంత్‌రెడ్డికి పార్లమెంట్‌ సభ్యుడిగా ప్రజలు అవకాశం ఇచ్చినా తన బుద్ధి మార్చుకోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని ఎలాంటి ఆధారాలు లేని అనా లోచిత ఆరోపణలు చేయడం నీ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తే ఇక నీకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవు చేసిన ప్రతి ఆరోపణలకు ఆధారాలతో బయట పెట్టాలాని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ దేశంలో లేని పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే ఓర్వలేకే రేవంత్‌ విమర్శలు చేస్తున్నారన్నారని ఆరోపించారు.  అయినా సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను విమర్శించే అర్హత నీకు లేదని, ఇప్పటికైనా అనాలోచిత ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను ఉద్దేశించి ఎంఐఎం పోటీ చేసిన ఆరు స్థానాల్లో బీజేపీ ఎందుకు పోటీ చేయాలని ప్రశ్నించారు. చేతకాకనా, లేదా పోటీ చేసే దమ్ములేకనా..లేదా లోపాయికారి ఒప్పందం ఏమైన ఉందా? అనే విషయాలను మాకు కాకపోయినా కనీసం ప్రజలకైనా చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మత రాజకీయాలు చెల్లవని గుర్తుంచుకోవాలని ఆయన లక్ష్మణ్‌కు సూచించారు.

కేసీఆర్‌, కేటీఆర్‌లను విమర్శిస్తే సహించం :  ఎమ్మెల్యే పట్నం

సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను అకారణంగా, అనాలోచితంగా విమర్శిస్తే సహించేది లేదని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. నీ గారడి మాటలు నమ్మి కొడంగల్‌ ప్రజలు నిండు రెండు పర్యా యాలు ఎమ్మెల్యేను చేసి వారిని అన్ని విధాలుగా మోసం చేశావని రేవంత్‌రెడ్డిని ఘాటుగా విమర్శించారు. కేవలం ఎన్నికలప్పుడు కనిపించే రేవంత్‌రెడ్డికి ఇక్కడ జరిగే అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. చుట్టం చూపులా వచ్చి నియోజకవర్గంలో ఫోజులు కొడితే ఇక్కడ చూసేవారు ఎవరూ లేరనే విషయాన్ని గుర్తించుకోవాలని హెచ్చ రించారు. నియోజకవర్గంలొ టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి పనులన్నీ నేనే చేశానంటు సిగ్గులేకుండా చెప్పు కుంటున్నావ్‌.. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆధారాలతో బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, దౌల్తాబాద్‌ జెడ్పీటీసీ మైపాల్‌, ఎంపీపీ విజయకుమార్‌, కోస్గి మండల టీఆర్‌ఎస్‌ నాయకులు మ్యాకల రాజేశ్‌, ఓంప్రకాశ్‌, వేణుగోపాల్‌, హన్మంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బాల్‌సింగ్‌, ఆయా గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌, బీజేపీ నేతలు

కోస్గి : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులైన కాంగ్రెస్‌ , బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సమక్షంలో శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కోస్గి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భా గంగా 3వ వార్డుకు చెందిన తిమ్మాయిపల్లిలో ఆ గ్రామానికి చెందిన మల్లేశ్‌, మొగులయ్య, రాజు, అంజిలయ్యలతో పాటు 40మంది నాయకులు, యువకులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో జెడ్పీటీసీ  ప్ర కాశ్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ రాములు, గ్రామ నాయకులు అమృతమ్మ, మద్దూర్‌ మండల నాయకుడు బాల్‌సింగ్‌, కోస్గి మండల నాయకులు తిమ్మాయిపల్లి హన్మంతు, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo