సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Jan 18, 2020 , 03:43:31

మిషన్‌ భగీరథ అమలు భేష్‌

మిషన్‌ భగీరథ అమలు భేష్‌
  • - ఇంటింటికీ మంచినీరు అందించడం అభినందనీయం
  • -తెలంగాణ ఇంజినీర్ల పనితీరు ఎంతో అద్భుతం
  • - జల్‌ జీవన్‌ మిషన్‌ జాతీయ బృందం సభ్యుల ప్రశంస

కోయిలకొండ: తెలంగాణలో ఇంటింటికీ శుద్ధ తాగునీరు అందించుటకు ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ అమలు అభినందనీయమని జల్‌ జీవన్‌ మిషన్‌ జాతీయ బృందం సభ్యులు అవినాష్‌ జుస్తిజీ, ఆర్‌కే సామా, హెచ్‌ఎస్‌ ప్రకాశ్‌కుమార్‌  వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ అమలు తీరును శుక్రవారం మండలంలోని అనంతాపూర్‌, శ్రీరామకొండ వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా మిషన్‌ భగీరథ రాష్ట్ర చీఫ్‌ ఇంజనీర్‌ చెన్నరెడ్డి, జిల్లా అధికారులతో కలసి అనంతాపూర్‌లో ఇంటింటికీ కూళాయితో తాగునీరు అందించే విధానాన్ని పరిశీలించి మహిళలతో తాగునీటి వివరాలను అడిగి తెలసుకొన్నారు. అనంతరం శ్రీరామకొండ వద్ద మిషన్‌ భగీరథ శుద్ధజల కేంద్రాన్ని పరిశీలించారు.  అనంతరం శుద్ధి అయిన నీటికి పరిక్షలు జరిపారు. అధికారులతో తాగునీరు వెళ్లే గ్రామాల వివరాలను మ్యాప్‌ల ద్వారా తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందివ్వడం అభినందనీయమని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ పథకాన్ని దేశంలో అన్ని రాష్ర్టాలో అమలు చేయుటకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఇంజనీర్‌ అధికారుల పనితీరు ప్రశంసనీయమన్నారు.  ఈ సందర్భంగా శుద్ధ జల కేంద్రంలో జాతీయ బృందం సభ్యులు మొక్కలను పరిశీలించి వారు కూడా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ ఈఈ వెంకటరమణ, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్‌, డిప్యూటీ ఈఈ నాగరాజు, ఏఈ గణేష్‌ నాయకులు భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.VIDEOS

logo