బరిలో 211 మంది

నారాయణపేట ప్రతినిధి,నమస్తే తెలంగాణ : మున్సిపల్ ప్రచారహోరు ఆరంభమయ్యింది. మంగళ వారం మధ్యాహ్నం ఉపసంహరణల గడువు ముగియ డంతో గిరిలో నిలిచిన అభ్యర్థుకు అధికారులు గుర్తులను కేటాయించారు. ఆ వెంటనే అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వారం రోజుల గడువు ఉండడంతో నేడు మూడు మున్సిపాలిటీలలోని 55 వార్డులలో బరిలో నిలిచిన 211 మంది అభ్యర్థులు వారి వార్డుల్లోకి వెళ్లి ప్రచారాలు ఆరంభించారు. తమ అనుచరులతో చర్చలు జరిపి వ్యూహాలను రూపొందింపజేసుకొని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని వార్డులలో అభ్యర్థులను రంగంలోకి దించగా పలు చోట్ల ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులు లేక చేతులెత్తేశారు.
చివరి రోజు పెద్ద ఎత్తున ఉపసంహరణలు
జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి మున్సి పాలిటీలలో పెద్ద ఎత్తున ఉప సంహరణలు జరిగాయి. నారాయణ పేటలో 24 వార్డులు, మక్తల్ 16, కోస్గిలో 16 వార్డులలో మొత్తం 56 వార్డులకు 576 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటిలో రెండు నామినేషన్లు మాత్రమే పలు కారణాలతో తిరస్కరింపబడ్డాయి. గత మూడు రోజుల నుంచి ఉపసంహరణలు జరుగుతుండగా చివరి రోజైన మంగళవారం పెద్ద ఎత్తున ఉప సంహరణ చేసుకున్నారు. 55 వార్డులకు గానూ 211 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీటిలో అత్యధిక స్థానాలలో ద్విముఖ, త్రిముఖ పోటీ నెలకొంది.
మున్సి పాలిటీల వారీగా వివరాలు
నారాయణ పేట మున్సిపాలిటీలో 24 వార్డులకు గానూ 80 మంది అభ్యర్థులు, మక్తల్‌లో 16 వార్డులకు 65 మంది రంగంలో ఉండగా, కోస్గిలోని 16 వార్డులకు 66 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. టీఆర్ఎస్ అన్ని స్థానాలలో తన అభ్యర్థులను రంగంలోకి దించగా కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు అభ్యర్థులు లేక పలు స్థానాలలో పోటీకి దూరంగా ఉన్నారు. నారాయణపేటలో పలు వార్డులలో ద్విముఖ, త్రిముఖ పోటీలు జరుగుతున్నాయి. మక్తల్, కోస్గిలోనూ దాదాపుగా ఇవే పరిస్థితులు ఉన్నాయి. కొన్నిచోట్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకొని రంగంలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది.
కోస్గిలో ఏకగ్రీవం
కోస్గి మున్సిపాలిటీలో 10వ వార్డు రిజర్వ్ స్థానం నుంచి నామినేషన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి రాస్నం అనితా బాలరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించు కోవడంతో అనిత ఏకగ్రీవ ఎన్నికను అధికారులు ధ్రువీకరించారు. 16 స్థానాలలో ఒక స్థానం ఏకగ్రీవం కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఎన్నికలను ఎదుర్కోవడానికి సన్నద్దం అవుతున్నాయి.
జోరందుకున్న ప్రచారం
ఉప సంహరణల గడువు ముగియగానే ప్రచారహోరు జోరందుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కాకముందు నుంచే ప్రచారాలు ఆరంభం కాగా మిగతా పార్టీలు ప్రచారాలు ఆరంభం అయ్యాయి. మంగళవారం నుంచే టీఆర్ఎస్ మరింత దూకుడు పెంచగా, మిగతా పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
తాజావార్తలు
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్‌కిషన్
- అన్నదానం ఎంతో గొప్పది: శేఖర్ కమ్ముల
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి