ఘనంగా సంక్రాంతి సంబురాలు

నారాయణపేట రూరల్ : మండలంలోని జాజాపూర్, అప్పిరెడ్డిపల్లి, సింగారం, కోటకొండ, కొల్లంపల్లి, అమ్మిరెడిపల్లితో పాటు తదితర గ్రామాలలో భోగి పండగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ యా గ్రామాలలో తమ తమ ఇండ్ల ముందు మహిళలు, రంగురంగులతో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూజ లు చేశారు. అలాగే పలు గ్రామాలలో చిన్నారులు, యువకులు గాలి పటాలను ఎగురవేశారు. అలాగే నువ్వులు, సజ్జలతో రొట్టెలు, వివిధ కూరగాయలతో ప్రత్యేక వంటకాలు తయారు చేసుకొని భుజించారు. సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుళ్లు బంధువులతో గ్రామాలన్నీ కళకళలాడాయి.
గ్రామాల్లో సంక్రాంతి క్రీడలు
నారాయణపేట మండలం కోటకొండ లో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో 23వ సంక్రాంతి క్రీడలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలను గ్రామ సర్పంచ్ వీ జయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ క్రీడలలో కబడ్డీ, వాలీబాల్, పరుగుపందెం, గాలి పతంగులు, ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎఫ్ఐ నాయకులు ప్రభాకర్ తెలిపారు. ఈ పోటీలలో వివిధ గ్రామాలకు చెందిన 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సునీత, గ్రామ నాయకులు రాము, కాశీనాథ్, కాశప్ప, బాలప్ప, ఆంజనేయులు, రాజేశ్, లక్ష్మీనారాయణ, కృష్ణ య్య, మ న్యం, దస్తప్ప పాల్గొన్నారు. ఎక్లాస్పూర్ గ్రామంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని గ్రామ భారతి ఆధ్వర్యంలో బాలికలకు ముగ్గుల పోటీ లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ భారతి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డితో పాటు పాల్గొన్నారు.
ఉడ్మల్‌గిద్దలో..
దామరగిద్ద : మండలంలోని ఉడ్మల్గిద్ద గ్రామంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్‌వై ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీలను స్థానిక ఎంపీపీ బక్క నర్సప్ప, ఎస్సై రాంబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్సై రాంబాబు, నాయకులు గోపాల్, మో హన్, భీంశప్ప, ప్రకాశ్, దామోదర్ పాల్గొన్నారు.
ధన్వాడలో..
ధన్వాడ : ధన్వాడతో పాటుగా మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవా రం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను వేసి గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. అలాగే చిన్న పిల్లలు, యువకులు ఉత్సాహంగా పతంగులను ఎగురవేశారు. కురుమ యాదవులు మైలారం మల్లయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని కంసాన్పల్లి, మందిపల్లి, రాంకిష్టాయ్యపల్లి, గోటూర్, కొండాపూర్, పాతపల్లి, చర్లపల్లితో పాటుగా పలు గ్రామాల్లో భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
తాజావార్తలు
- ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు ఏంచేశారు?
- ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉంటయా?
- రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు
- లెక్కతప్పని తేలిస్తే ముక్కు నేలకురాస్తా
- నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- ప్రభుత్వం.. ఉద్యోగులది పేగుబంధం
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- సేవ చేస్తే శిక్ష రద్దు
- టీటా రాష్ట్ర కార్యదర్శిగా వెంకట్ వనం