ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Jan 15, 2020 , 03:22:29

పోరు సుర్వాయే..

పోరు సుర్వాయే..


నారాయణపేట ప్రతినిధి, నమస్తేతెలంగాణ : గీ సంక్రాంత్రి వస్తుండదంటే సాలు ఇండ్ల ముందల ఆడోళ్లు వేసే ముగ్గులు, హరిదాసులోల్ల పాటలు, గంగిరెద్దులోల్ల ఆటలు, భోగి మంటల సుట్టూ మస్తు మస్తుగా  ఆటా పాటలు సాగెట్వి..
మూడు దినాల పొద్దు గీ పండుగ జోరే ఏరు. సలిని ఒదిలిచ్చుకొనికే బోగి పండుగ దినం న  సద్దలు, నూగుల రొట్టెలు దిని, మరుసటి దినం సంక్రాంతికి లచ్మీ పూజలు జేసుకొని గా ఎద్దులను మంచిగా కడిగి సింగారం జేసి బండ్లు గట్టి దేవుండ్ల సుట్టూ గోయిందలు గొడుతుంటే గా జోరే ఏరు..

ఇంగో దిక్కేమో పోరగాల్లు లొల్లులు జేసుకుంటా పతంగులు ఎగిరేస్తుంటే సంతోసం ఆకాసంలో తిరిగినట్లయ్యెటిది. ఇగ మూడో దినం కనుమ. గీరోజయితే చెప్పగుడ్దు పొటేళ్లు గోసుకొని మాంసం కుప్పలు పంచుకొని బగార ఏసుకొని ఇంత మందుదెచ్చుకొని నాసామిరంగా.. గప్పాలు గొట్టుకుంటా తింటుంటే గా జోరే ఏరప్పా..

ఇంగింత మంది అయితే పొటేళ్లు, కోడి కొట్లాటలకు, పొయ్యి ఇంతమంది పైసలు సంపాయించుకుంటే, ఇంతమంది పైసలు పోగొట్టుకునేటోళ్లు. గట్లయినా మీసం మెలేసేటోళ్లు. గట్లాంటి పండుగ గిప్పుడు ఒచ్చెటప్పుడు గీ మున్సిపల్‌ ఎలచ్ఛన్లను తెచ్చె. పల్లెలుల్ల సంక్రాత్రి పండుగా ఎప్పడిలాకనే జరుగుతుంటేగా పట్నాలుల్ల మాత్రం ఎలచ్చన్లు వచ్చినయి. పండుగజోరుకు ఎలచ్చన్లజోరు కల్వడంతో ఇంగ జెప్పొద్దు పండుగ జోరు..
గీ మంగళారం పోటీ జేయాలనుకున్నోళ్లలో జెరంత మంది తప్పుకుండ్రి. గిప్పుడు గీ పండ్గకు పందెం కోళ్లకు బదులుగా ఎలచ్చన్ల పైల్మన్లు బరిల దిగిండ్రు. మంగళారం ఒకటి.. రెండు, మూడుగా అధికారులు  అనగానే పెచారం జేయనికే ఉరుకుడు మొదలు పెట్టిండ్రు. గంటగాదు.. దినంగాదు.. గీ వారం దినాలు పెచార పోరాటాలు జేయాలే. ఓటరుదేవుండ్లను మెప్పించాలే. గందుకు గా దేవుండ్లకు నైవేద్యాలు వెట్టాలే.. ఓల్లు తిట్టినా అయ్యో నీనోరు నొప్పివటింట్టిందా అని అడ్గాలే.. ఒంగి ఒంగి  దండాలు వెట్టాలే.. లేని పేమను ఒల్కొయ్యాలే.. పెద్ద పెద్దోల్లను దోల్కొచ్చి పెచారం జేపియ్యాలే..

ఎలచ్చన్లు అయ్యేదాంక దినాం పండుగ జెయ్యాలే గప్పుడే మంచిగా ఉంటది. మల్ల ఎదుటోల్ల ఎత్తులకు పై ఎత్తులు ఎయ్యాలే.. ఆవ గింజంతా అద్రుష్టం కలిసి రావాలే.. గంతవరకు గీ మున్సిపల్‌ పండుగా దినాం జరుగాలే.. గప్పటిదాంకా.. పెచారాన్ని సూస్కుంటా పోదాం.


VIDEOS

logo