ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 14, 2020 , 02:45:44

బరిలో నిలిచేదెవరో..?

బరిలో నిలిచేదెవరో..?


నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల పోరులో చివరి వరకు నిలిచేదెవరో తొలిగేదెవరో అనే విషయంపై మంగళవారం సాయంత్రానికి స్పష్టత రానుంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత నామినేషన్‌ దాఖలుకు చివరి రోజు వరకు జిల్లాలోని నారాయణపేట, కొస్గి, మక్తల్‌ మున్సిపాలిటీలో ఉన్న 56వార్డులకు అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. నారాయణపేటలో ఉన్న 24 వార్డులకు గాను ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు మొత్తం 151మంది నామినేషన్లు దాఖ లు చేయగా, కొ స్గిలోని 16వార్డులకు 170మంది, మక్తల్‌లోని 16 వా ర్డులకు 255మంది నామినేషన్ల దాఖలు చేశారు. ఈ నా మినేషన్లలో నారాయణపేటలో ఒకటి, కోస్గిలో మరో నామినేషన్‌ అధికారుల పరిశీలనలలో తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన నామినేషన్లు సరైనవి కావడం తో అభ్యర్థులందరూ రంగంలో ఉండే అవకాశం ఉంది.

తొలిగేదెవరో..

ప్రధాన రాజకీపార్టీల నుంచి బీ ఫారాలను ఆశిస్తూ అభర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేశారు. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ప్రతి స్థానం నుంచి ఐదారుగురు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలలో పెద్దగా పోటీ లేకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసిన వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది. మరి కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థిలు బరిలో నిచిచారు. వీరిలో కొంత మందిని ఉపసంహరణ చేయిం చడం వల్ల ఎన్నికలను సునాయాసంగా ఎదుర్కోవడాకి పావులు కదుపుతున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు సై తం ఇతర అభ్యర్థులు వైదొలగమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం వరకు ఉపసంహరణ గడువు ఉండడంతో పోటీ నుంచి ఎవ రు వైదోలుగు తారో, ఎవరు మిగులుతారో అనే అంశంపై జోరుగా చర్యలు సాగుతున్నాయి.

జోరందకొన్న ప్రచారాలు

నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన వెంటనే పోటీలో ఉన్న అభర్థులు మంగళవారం సాయంత్రం నుంచి తమ తమ ప్రచారాలలో ప్రారంభించనున్నారు. ఎన్నికలు జరిగే వరకు ఆయా అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే లు, మంత్రులు,నాయకులు, ప్రచారం చేయడానికి హాజరు కానుండడంతో జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు ఎన్నికల ప్రచారంలో హోరెత్తనున్నాయి.


VIDEOS

logo