శనివారం 06 మార్చి 2021
Narayanpet - Jan 13, 2020 , 03:26:53

జోరుగా బుజ్జగింపులు

జోరుగా బుజ్జగింపులు

తమ్మి.. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వూ..నీ మంచి చెడు నేను చూసుకుంటా అంటూ ఓ సీనియర్‌ నాయకుడి అభ్యర్తన. అన్నా ఎప్పుడూ నీకు అండగా ఉన్నాం. ఇప్పుడు నాకు అవకాశమివ్వూ.. నీవు చెప్పినట్లే పనులు చేద్దాం..

నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తమ్మి.. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వూ..నీ మంచి చెడు నేను చూసుకుంటా అంటూ ఓ సీనియర్‌ నాయకుడి అభ్యర్తన. అన్నా ఎప్పుడూ నీకు అండగా ఉన్నాం. ఇప్పుడు నాకు అవకాశమివ్వూ.. నీవు చెప్పినట్లే పనులు చేద్దాం.. నీదే పెద్దరికం.. అంటూ మరో జూనియర్‌ కార్యకర్త అభ్యర్థన. అన్నా మీ మరదలు పోటీ చేసేందుకు అవకాశం దొరికింది. ఇలా ఎవరికి తోచిన రీతిలో ఆర్థికంగా వారిని ఆదుకుంటామని పలువురు నాయకులు కౌన్సిలర్‌ పోటీలో ఉన్న అభ్యర్థులను కలుసుకొనే పనిలో నిమగ్నమయ్యారు.  జిల్లాని మున్సిపాలిటీలలో బుజ్జగింపుల పర్వం కొనపాగుతుంది. ఉపసంహరణలకు గడువు మరోరోజు మాత్రమే ఉండడంతో విస్తృతంగా మంతనాలు జరుగుతున్నాయి. నయానో బయానో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు పోటీలో ఉంటే ఓట్లు చీలి తమకు మేలు కలుగుతుందని వారిని ఎలాగైన పోటీలో కొనసాగించే ప్రయత్నాలు సాగిస్తున్నారు.


కొనసాగుతున్న సంప్రదింపులు..

నామినేషన్ల దాఖలు, పరిశీలనల ఘట్టాలు ముగిసిన తర్వాత ఉపసంహరణలకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. పార్టీల ముఖ్య నాయకులతో మాట్లాడిస్తూనే మరోవైపు ఉమ్మడి స్నేహితులు, బంధువులతో సంప్రదింపులు చేయిస్తున్నారు. ఎన్నడూ లేని పరిచయాలు, బంధాలను కలుపుకొని మంతనాలు కొనసాగిస్తున్నారు. స్వయంగా  సంప్రదింపులు చరుపడంద్వారా పోటీకీ అడ్డున్న వారిని తప్పించే ప్రయత్నాలు చేసుకుంటున్నారు.


అధికంగా అధికార పార్టీయే..

నారాయణపేట, మక్తల్‌, కోస్గి మున్సిపాలిటీలలో దాఖలైన నామినేషన్లో అత్యధికంగా అధికార పార్టీ వారు దాఖలు చేసినవే. కాంగ్రెస్‌, బీజేపీ నుంచి అంతంత మాత్రమే ఉండటంతో ఆయా అభ్యర్థులతో బేరసారాలు అంతగా లేవు. ఒక్కొక్క వార్డు నుంచి సగటున ఐదారుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు రంగంలో ఉండటంతో ముఖ్యనేతలు సంప్రదింపులలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా బడా నాయకులు కూడా ఎవరికీ చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. 


పూర్తి కావచ్చిన టీఆర్‌ఎస్‌ జాబితా..

గత మూడు రోజుల నుంచి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు తలమునకలై ఉన్నారు. ఆదివారానికి వార్డుల వారీగా జాబితాలు ఓ కొలిక్కివచ్చినట్లు తెలుస్తుంది. సోమవారం అభ్యర్థులను ప్రకటించి మిగతా వారిని ఉపసంహరింపజేసేలా చర్యలు చేపట్టనున్నారు.


మరో ఉత్కంఠ

మున్సిపాలిటీలలో వార్డుల వారీగా ఎవరికి అవకాశం లభిస్తుందోనని ఇటు అభ్యర్థులు అటూ ఓటర్లు ఉత్కంఠ నెలకొంది. పార్టీలవారీగా ఎవరికీ అవకాశం వస్తుందోనని అయోమయంలో పడ్డారు. బీ-ఫారాలు ఎవరికీ లభిస్తాయి.. అన్న జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు ఈ ఉత్కంఠకు తెర పడనుంది.

VIDEOS

logo