బుధవారం 03 జూన్ 2020
Narayanpet - Jan 13, 2020 , 03:21:51

అజేయ శక్తిగా టీఆర్‌ఎస్‌

అజేయ శక్తిగా టీఆర్‌ఎస్‌

ప్రజా సంక్షేమానికి నిరంతరం ప్రజలందరికీ అండగా ఉండి పట్టణ ఆభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

  • మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన నాయకులు

మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ: ప్రజా సంక్షేమానికి నిరంతరం ప్రజలందరికీ అండగా ఉండి పట్టణ ఆభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం రాత్రి పాలమూరు పట్టణంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో 28వార్డు బండ్లగేరికి చెందిన శ్రావణ్‌కుమార్‌తోపాటు పలువురు నాయకులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, జిల్లా ఆభివృద్ధిని చూసి పార్టీలో ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుతున్నారన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి జిల్లా ఆభివృద్ధికి కృషిచేస్తానని, మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కోరమోని వెంకటయ్య, రాజేశ్వర్‌, శాంతయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo