ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 12, 2020 , 06:12:26

బీజేపీని ఓడించండి

బీజేపీని ఓడించండి
  • ధనికులకు కొమ్ముకాస్తున్న మోడీ సర్కారు
  • హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ
  • హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. శనివారం రాత్రి రామయ్యబౌలిలో ఎంఐఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని పని చేస్తుందన్నారు. కేంద్ర సర్కార్‌ ధనికులకు అనుకూలంగా, నిరుపేదలకు వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎన్‌ఆర్సీ పేరుతో దేశంలో చిచ్చుపెడుతున్నారని, దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్సీకి వ్యతికంగా పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. దేశంలో నిరుద్యోగంతోపాటు, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్వించారు. ఎన్‌ఆర్సీని కేరళ ప్ర భుత్వంలా మన రాష్ట్రంలో కూడా అమలు కాకుండా చూడాలన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పూర్తి నమ్మకం ఉందన్నారు. కాగా, మహబూబ్‌నగర్‌లో మినీ ట్యాంక్‌బండ్‌ అద్భుతంగా ఉందని, ఇందుకు కృషి చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అభినందనలు తెలిపారు. సమావేశంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌హాది, యువత అధ్యక్షుడు జాకీర్‌, పట్టణ అధ్యక్షుడు సాదుతుల్లా హుస్సేనీ, పరిశీలకులు అన్వర్‌సాదత్‌, జాబేర్‌ బిన్‌ సయీద్‌, నాయకులు జహంగీర్‌, అన్వర్‌, ముంజిమి ల్‌, వాజీద్‌, బశ్వల్‌ తదితరులు ఉన్నారు. 

VIDEOS

logo