గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 12, 2020 , 05:36:27

నామినేషన్ల పరిశీలన పూర్తి

నామినేషన్ల పరిశీలన పూర్తి
  • -పేటలో ఒకరి, కోస్గిలో మరొకరి నామినేషన్‌ తిరస్కరణ

నారాయణపేట, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. శనివారం పేట మున్సిపాలిటీలో వివిధ వార్డులకు నామినేషన్లను వేసిన అభ్యర్థుల నామినేషన్‌ పత్రాల స్క్రూట్నీని చేపట్టారు. పట్టణంలో 2వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ తరపున నామినేషన్‌ వేసిన ఉజ్వల భర్త అనంతరెడ్డి నామినేషన్‌ తిరస్కరణకు గురైనట్లు మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ సందీప్‌ తెలిపారు. 2014 ఎన్నికలలో ఖర్చుల వివరాలను ఇవ్వనందుకుగాను ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు 2వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరించినట్లు ఆయన తెలిపారు.

కోస్గిలో..

కోస్గి టౌన్‌ : కోస్గి మున్సిపాలిటీలో 16 వార్డులకు దాఖలైన నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. 16 వార్డులకు గాను 170 నామినేషన్లు దాఖలు కాగా అందులో ఒక నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. మూడో వార్డుకు చెందిన అను రాధకు సంబంధించిన నామినేషన్‌ వయస్సు తప్పుగా ఉన్నందున నామినేషన్‌ తిరస్కరణ చేయబడిందని మున్సిపల్‌ కమిష్‌నర్‌ శామ్యూల్‌జాన్‌ తెలిపారు. 169 నామినేషన్లు ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటున్నామని కమిషనర్‌ వెల్లడించారు. 

మక్తల్‌లో..

 మక్తల్‌ టౌన్‌ : మక్తల్‌ మున్సిపాలిటీ ఎన్నికలలో భాగాంగా 16 వార్డులకు నామినేషన్లు వేసిన 117 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు తేల్చారు. శనివారం ఉదయం నుంచి రిటనర్నింగ్‌ అధికారులు అభ్యర్థులు దాఖాలు చేసిన నామినేషన్లు పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకోనేందుకు 14వ తేదీ మధ్యాహ్నం వరకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

VIDEOS

logo