జీవితంలో ఏ విధంగా స్థిరపడాలో ఎన్సీసీ నేర్పుతుంది

నారాయణపేట టౌన్ : సాధారణ విద్యార్థుల కంటే ఎన్సీసీ విద్యార్థులకు జీవితంలో ఏ విధంగా స్థిరపడాలో ఎన్సీసీ నేర్పుతుందని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి అన్నారు. ఎన్‌సీసీతో క్రమశిక్షణ, దేశభక్తి, లౌకికతత్వ భావాలు పెం పొందుతాయని చెప్పారు. పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి స్మా రక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శేఖర్‌రెడ్డి అధ్యక్షతన 8వ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ 14వ వార్షిక శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఎన్‌సీసీతో నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు అలవడతాయని అన్నారు. ఈ ఎన్సీసీ శిక్షణ శిబిరంలో ఎన్సీసీ క్యాడెట్స్ 10రోజుల పాటు తాము నిర్ణయించుకున్న రంగాలలో శిక్షణ పొంది క్రమశిక్షణను అలవరచుకోవాలని సూచించారు. ఎన్సీసీ కమాండెంట్ ఆఫీసర్ హరపాల్సింగ్ హీర్ మాట్లాడుతూ ఈ 10రోజులు క్యాంప్‌లో విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు సమాజానికి ఉపయోగపడే నైతిక విలువలను పెంపొందించే విధంగా తర్ఫీదు ఇస్తామన్నారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్స్ దేశభక్తికి సంబంధించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్‌లోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన 600 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ సుబేదార్ మేజర్ రాంలాల్, రిటైర్డ్ ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి, లీగల్ అడ్వైజర్ ఆకుల బాలప్ప, ఎన్సీసీ ఏఎన్‌వో రాజశేఖర్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు లక్ష్మణాచారి, నారాయణగౌడ్, రంగారెడ్డి, జైపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రవికుమార్, ఎన్సీసీ సిబ్బంది వెంకటరమణ, జనార్దన్, రమణ, తఖీబ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- డేటా చోరీ గిఫ్ట్‌ల పేర బురిడీ..!
- షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
- ఓటీపీ చెప్పండి.. కార్డు గడువు పొడిగిస్తాం..!
- రెండు రోజుల్లో.. రూ. 5లక్షలకు 4.5 కోట్లు లాభం
- రుణాల పేరుతో.. బురిడీ..
- పెండ్లి పేరుతో వల.. రూ. 10.69లక్షలు టోకరా
- బండి ఆపు.. పైసలివ్వు..!
- బండిస్తే జైలుకే..
- నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య
- దళిత వ్యతిరేకి బండి