రంది లేకుండా కంది కొనుగోళ్లు

దామరగిద : రంది లేకుండా కంది కొనుగోలు చేస్తామని, ఈ కేంద్రంలో రైతులు కందులు విక్రియించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కంది కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం చాకలివారిపల్లి గ్రామ పంచాయతీకి మంజూరైన ట్రాక్టర్‌కు పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలాగే గ్రామాలు శుభ్రంగా ఉంటేనే గ్రామస్తులు ఆరోగ్యంగా ఉంటారని, అందుకే ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, జెడ్పీటీసీ లావణ్య, స్థానిక సర్పంచ్ వన్నడి ఆశమ్మ, పీఎసీఎస్ అధ్యక్షుడు హన్మిరెడ్డి, అధికారి మురారి, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకుడు వెంకట్‌రెడ్డి, మండల నాయకులు రాచప్ప, వైస్ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, నాయకులు కేవీఎన్‌రెడ్డి, శరణప్ప, బసంత్‌రాజ్, మాజీ సర్పంచ్ భీమయ్యగౌడ్ పాల్గొన్నారు.