ప్రతి పైసాకూ లెక్క చెప్పాల్సిందే!

- ఖర్చు రూ.లక్షలోపే ఉండాలి
- ఎప్పటికప్పుడు వివరాలు అందించాలి
- జిల్లా జనరల్ పరిశీలకురాలిగా పౌసమిబసు
- నారాయణపేట కలెక్టర్ వెంకట్రావు
- ఎన్నికల నిబంధనలు పాటించాలి
- జిల్లా వ్యయ పరిశీలకులు భీమ్లా
నారాయణపేట టౌన్ : ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులు లక్షలోపే ఉండాలని, అందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్లకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల ఎన్నికల సంద ర్భంగా బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసిఎంసి)ని జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా వ్యయ పరిశీలకులు భీమ్లా నాయక్‌లు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ పేట జిల్లాకు జనరల్ పరిశీలకులుగా పౌసమి బసును, వ్యయ పరిశీలకులుగా భీమ్లా నాయక్‌లను ఎన్నికల కమిషన్ నియమించిందన్నారు. నామినేషన్ మొదలైన రోజు నుంచి ఫలితాలు వెళ్లడించే రోజు వరకు జిల్లాలో ఉండి పర్యవేక్షణ చేస్తారన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు రూ.1 లక్ష వరకు ఖర్చు పెట్టుకోవచ్చన్నారు. రూ.1 లక్ష కన్నా.. ఎక్కువ ఖర్చు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. మూడు మున్సిపాలిటీలకు ముగ్గురు అసిస్టెంట్ వ్యయ పరిశీలకులను నియమించామని తెలిపారు. దీనికి డీసీవో నోడల్ అధికారిగా ఉంటారని, ఎంసీఎంసీ కమిటీకి వచ్చిన ఫిర్యాదులను వీడియో వీవింగ్ టీం ద్వారా వచ్చిన ఫిర్యాదులను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ చూపిస్తే షాడో రిజిస్టర్ పెట్టి నోటీస్ ఇస్తామన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు భీమ్లా నాయక్ మాట్లాడుతూ మూడు మున్సిపాలిటీ టీంలలో ఎంసీఎంసీ, ఫ్లయింగ్ స్వాడ్, వీడియో వీవింగ్ టీంలు అందరూ ఒకరికొకరు అనుబంధంతో పని చేస్తే ఎక్స్పెండీచర్ రిపోర్టు కొలిక్కి వస్తుందన్నారు. ఎవరూ కూడా వాయిలెట్ చేయరాదని, ప్రతి మున్సిపాలిటీ నామినేషన్ వేసిన అభ్యర్థులకు సమావేశం పెట్టి వాయిలెట్ చేయకుండా చూస్తామన్నారు. ఎలక్షన్ కమిషన్ వారి సూచనలు తప్పక పాటించి పని చేస్తే జిల్లాకు మంచి పేరువస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీఎంసీ సభ్యులు సీపీవో భూపాల్ రెడ్డి, ఆత్మారాం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
- అగ్రిహబ్‌కు నాబార్డ్ 9 కోట్లు
- ఉప ఎన్నికలేవైనా.. గెలుపు టీఆర్ఎస్దే
- ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
- కరోనా టీకా తప్పక వేయించుకోవాలి
- వైభవంగా నిర్వహించాలి
- రెన్యూవబుల్ ఎనర్జీలో
- ధర్మపురి ఆలయానికి స్థపతి వల్లినాయగం
- 7న బ్రాహ్మణ పెద్దలతో మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్టి
- సినీ హీరోగా సింగరేణి బిడ్డ