e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News స్కూటీని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. వ్యక్తి దుర్మరణం

స్కూటీని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. వ్యక్తి దుర్మరణం

స్కూటీని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. వ్యక్తి దుర్మరణం

నల్లగొండ : స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి శివారులో నాగార్జున సాగర్‌-హైదరాబాద్‌ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. నాంపల్లి మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన గుమ్మడపు సంతోష్ రావు (38) చింతపల్లి మండలం వెంకటంపేట గేట్ సమీపంలో కిరాణా షాపు నడుపుతున్నాడు. ఉదయం దుకాణం తెరిచేందుకు స్కూటీపై బయల్దేరాడు.

నసర్లపల్లి శివారులోని కేవీఎస్‌ స్పిన్నింగ్ మిల్ వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తలఛిద్రమై సంతోష్‌ రావు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్కూటీని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. వ్యక్తి దుర్మరణం

ట్రెండింగ్‌

Advertisement