నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితం రౌండ్ల వారీగా వెలువడుతున్నాయి. ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుంది. మొత్తం 25 రౌండ్లకు గానూ 20 రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. 20వ రౌండ్లో టీఆర్ఎస్కు 1080 ఓట్ల ఆధిక్యం చేకూరింది. మొత్తం మీద 20వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి అధికార టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 15,556 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా ఐదు రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి ఉంది.