నందికొండ, ఆగస్టు 5 : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో పెరగడంతో డ్యాం 16క్రస్ట్ గేట్లను 10అడుగులు ఎత్తి 2,38,944 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు 1,52,282 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 5 క్రస్ట్ గేట్లు, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 2,85,182 క్యూసెక్కులు విడుదలవుతున్నది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 అడుగుల (310.8498 టీఎంసీల) మేర నీరు నిల్వ ఉంచి, శ్రీశైలం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను యథాతథంగా విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వకు 4,416క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33,698 క్యూసెక్కులు, కుడి కాల్వకు 6,324 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.