e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home నల్గొండ పకడ్బందీగా లాక్‌డౌన్‌

పకడ్బందీగా లాక్‌డౌన్‌

  • ఆరు క్లస్టర్లుగా చిట్యాల మండలం విభజన
  • మూడు గ్రామాలకో ఐసొలేషన్‌ కేంద్రం
  • ఇప్పటికే 28 ఎఫ్‌ఐఆర్‌లు.. 150కి పైగా ఈ-చలానా
  • కేసులు.. 30 వాహనాలు సీజ్‌
పకడ్బందీగా లాక్‌డౌన్‌

చిట్యాల, మే 19 : మండలంలో కరోనా కట్టడి కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. చిట్యాల మున్సిపాలిటీతోపాటు గ్రామాల్లో కూడా వ్యాపార సంస్థలను సమయానుకూలంగా మూసివేయిస్తూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వెల్మినేడు శివారులో ప్రత్యేక చెక్‌పోస్టును ఏర్పాటు చేసి జాతీయ రహదారిపై వాహనాలను అదుపు చేస్తున్నారు. ఇప్పటికే లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా వ్యాపార సంస్థలపై 28 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. దాదాపు 150కి పైగా ఈ చలానా కేసులను నమోదు చేసి, 30 వాహనాలను సీజ్‌ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామాన్ని యూనిట్‌గా చేసి అక్కడి ప్రజాప్రతినిధులు, యువతతో ఓ వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేశారు. అంతేకాక చిట్యాల ఎస్‌ఐ రావుల నాగరాజు ప్రజలకు కరోనాపై పూర్తి అవగాహన కల్పించడంతోపాటు కరోనా కట్టడి, ప్రజల సౌకర్యార్థం మండలాన్ని 6 యూనిట్లుగా విభజించారు. ప్రతి మూడు గ్రామాలకో క్లస్టర్‌ను ఏర్పాటు చేసి అక్కడ కరోనా వచ్చిన వ్యక్తుల కోసం ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మొదటి ఐసొలేషన్‌ కేంద్రాన్ని గుండ్రాంపల్లిలో ఏర్పాటు చేయనున్నారు.

మూడు గ్రామాలకో క్లస్టర్‌
ప్రజలకు కరోనాపై పూర్తి అవగాహన కల్పించడంతోపాటు పేషెంట్లకు అవసరమైన సాయం అందించడానికి ప్రతి మూడు గ్రామాలకో క్లస్టర్‌ను ఏర్పాటు చేశాం. యువత, ప్రజాప్రతినిధుల సాయంతో ప్రతి క్లస్టర్‌లో ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం.

  • రావుల నాగరాజు, ఎస్‌ఐ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పకడ్బందీగా లాక్‌డౌన్‌

ట్రెండింగ్‌

Advertisement