e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home నల్గొండ ఇంటింటా మొక్కలు.. ఊరంతా పచ్చదనం

ఇంటింటా మొక్కలు.. ఊరంతా పచ్చదనం

  • ఘనంగా మంత్రి కేటీఆర్‌ జన్మదినోత్సవం
  • ముక్కోటి వృక్షార్చనలో పెద్దసంఖ్యలో పాల్గొన్న ప్రజలు
  • పాల్గొన్న మండలి మాజీ చైర్మన్‌ గుత్తా, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, భగత్‌, భాస్కర్‌రావు

దేవరకొండ : ప్రతి ఇంట్లో మొక్కలు నాటడం ద్వారా ఊరంతా పచ్చదనం నింపాలని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. శనివారం మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ముక్కోటి వృక్షార్చనలో భాగంగా పట్టణంలోని 7వ వార్డులో 500 మొక్కలు నాటారు. కొండమల్లేపల్లిలో మొక్కలు నాటారు. చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లో కేక్‌ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కొండభీమనపల్లిలో ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్‌ మొక్కలు నాటారు. చింతపల్లి మండలంలో జడ్పీటీసీ కంకణాల ప్రవీణావెంకట్‌రెడ్డి, డిండిలో ఎంపీపీ మాధవరం సునీతాజనార్దన్‌రెడ్డి మొక్కలు నాటారు. పీఏపల్లి మండలంలో ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వల్లపురెడ్డి కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్‌ చైర్మన్‌ శిరందాసు లక్షమ్మాకృష్ణయ్య, వైస్‌ చైర్మన్‌ రహత్‌అలీ, వైస్‌ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌, నాయకులు టీవీఎన్‌రెడ్డి, పున్న వెంకటేశ్వర్లు, రైతుబంధు మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, కేసాని లింగారెడ్డి, సర్పంచ్‌ కుంభం శ్రీనివాస్‌గౌడ్‌, కమిషనర్‌ వెంకటయ్య, తౌఫిక్‌, చిత్రం ప్రదీప్‌, అసోక్‌, వాజిద్‌ వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, మల్లారెడ్డి, ఎంపీడీఓ రాములునాయక్‌, జడ్పీటీసీ బాలూనాయక్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ కొండూరు భవాని, మాజీ ఎంపీపీ సర్వయ్య, అనంతగిరి, లక్ష్మానాయక్‌, మున్న య్య, సర్పంచ్‌, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

మిర్యాలగూడలో..
మిర్యాలగూడ రూరల్‌ : మున్సిపాలిటీలోని తాళ్లగడ్డ, ఎన్‌ఎస్పీ క్యాంపులో శాసన మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలిసి మొక్కలు నాటారు. మండలంలోని వెంకటాద్రిపాలెంలో బృహత్‌ పల్లె పకృతి వనంలో గుత్తా, భాస్కర్‌రావుతో పాటు వేయ్యి మంది ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్నారు. మండలంలోని 46 గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో కేటీఆర్‌ జన్మదినం జరుపుకున్నారు. మొక్కలు నాటారు. కార్యక్ర మంలో మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగర్‌ భార్గవ్‌, మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ బారెడ్డి అశోక్‌ రెడ్డి, ఎంపీడీఓ దేవిక, ఎంపీఓ వీరారెడ్డి, పీఆర్‌ ఏఈ చిల్లంచర్ల ఆదినారాయణ , ఏఈఓ శిరీష, సర్పంచ్‌ వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. మార్కెట్‌ యార్డులో వైస్‌ చైర్మన్‌ లావూరి మేగ్యానాయక్‌, అడవిదేవులపల్లి మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ ధనావత్‌ బాలూనాయక్‌, కుర్ర సేవ్యానాయక్‌, ఎంపీడీఓ మసూద్‌ షరీఫ్‌, సర్పంచ్‌కుర్ర ఫకీర్‌, వేములపల్లి మండలంలో సర్పంచ్‌ నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, మజ్జిగపు పద్మాసుధాకర్‌రెడ్డి, డి. వెంకట్‌ రెడ్డి, చిల్లమల్లయ్య యాదవ్‌ పాల్గొన్నారు.

- Advertisement -

నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో
హాలియా : నాగార్జునసాగర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా కేటీఆర్‌ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. హాలియా, నిడమనూరు, పెద్దవూర, నందికొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల భగత్‌ పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం హాలియా తేరా చెన్నారెడ్డి నగర్‌లో 2వేల మొక్కలు నాటారు. పెద్దవూర మండలం గర్నెకుంట గ్రామంలో సర్పంచ్‌ నడ్డి హాలియమ్మ రామాంజనేయులు ఆధ్వర్యంలో 3 వేల మొక్కలు నాటారు. త్రిపురారం, తిర్మలగిరి సాగర్‌ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్‌ రాంచందర్‌నాయక్‌, , జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, హాలియా, నందికొండ, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు వెంపటి పార్వతమ్మా శంకరయ్య, కర్ణ అనూషారెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, మల్గిరెడ్డి లింగారెడ్డి, గోనే విష్ణువర్ధన్‌రావు, మార్కెట్‌ చైర్మన్లు కామర్ల జాన య్య,యడవల్లి మహేందర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ ఇరిగినేని అంజయ్య, ఎంపీపీలు బొల్లం జయమ్మ, మంచికంటి వెంకటేశ్వర్లు, ఆంగోతుభగవాన్‌ నాయక్‌, వైస్‌ చైర్మన్‌ నల్లగొండ సుధాకర్‌, మందా రఘువీర్‌, గుంటుక వెంకట్‌రెడ్డి, నడ్డి లింగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, శాగం శ్రవణ్‌కుమార్‌ రెడ్డి, పోలె డేవిడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, తాడి సత్యపాల్‌, రవినాయక్‌, గజ్జెల చెన్నారెడ్డి, పిడిగం నాగయ్య, బహునూతల నరేందర్‌, గాలి రవికుమార్‌, పాశం గోపాల్‌రెడ్డి, శాగం రాఘవరెడ్డి, మెండె సైదులు యాదవ్‌, అనంతరెడ్డి, రామగిరి చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.

వైకుంఠ రథం ప్రారంభం
మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎవరైనా మృతి చెందితే వారి పార్థ్దివదేహాన్ని ఉచితంగా శ్మశాన వాటికకు తరలించేందుకు గానూ ఎన్‌బీఆర్‌ ఫౌండేషన్‌ వారు వైకుంఠ రథాన్ని తయారు చేయించి అందించారు. శనివారం మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రథాన్ని గిఫ్ట్‌ఏ స్మైల్‌ కింద అందించగా మిర్యాలగూడలోని తాళ్లగడ్డలో శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు పడుతున్న ఇబ్బందులు గమనించి ఎన్‌బీఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ నల్లమోతు సిద్ధార్థ వైకుంఠరథాన్ని అందించడం హర్షణీయమన్నారు. రథం సేవలు కావాల్సిన వారు 9162363636 నంబర్‌కు ఫోన్‌ చేయాలని ఫౌండేషన్‌ చైర్మన్‌ కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, జడ్పీటీసీ విజయసింహారెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, చిట్టిబాబు, నాగార్జునాచారి, రంగారెడ్డి, బాసాని అలివేలుగిరి, ఇంజం శ్రీధర్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana