e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home నల్గొండ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

ఆత్మకూర్‌(ఎస్‌)/ శాలిగౌరారం/ తిరుమలగిరి సాగర్‌, జూలై 24 : గ్రామ పంచాయతీ చెరువు, కుంటలను మత్స్యశాఖకు అప్పగించడంపై ముదిరాజ్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శనివారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని నెమ్మికల్‌ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి ఫ్లెక్సీకి తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు ఈదుల యాదగిరి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18సంవత్సరాలు నిండిన ముదిరాజ్‌లకు సభ్యత్వం కల్పించడం మత్య్స కార్మికులకు వరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముదిరాజ్‌ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సభ మండలాధ్యక్షుడు అల్లి వెంకన్న, నెమ్మికల్‌ మత్స్య సహకార సొసైటీ అధ్యక్షుడు జంగ వెంకటేశ్వర్లు, గంగరబోయిన శ్రీను, లక్ష్మీనర్సు, బాలరాజు, సైదులు, రమేశ్‌, వెంకన్న, హరీశ్‌, గురుస్వామి, శ్రీను పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.6 కోట్లు కేటాయించి యూనిట్‌ ధరను రూ.1,75లక్షలకు పెంచడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో నూక జానయ్యయాదవ్‌, నూక భద్రయ్య, గజ్జి నరేశ్‌, కన్నెబోయిన అంతయ్య, గజ్జి లింగయ్య, లింగమల్లు, శ్రీనివాస్‌, వెంకన్న పాల్గొన్నారు. తిరుమలగిరి సాగర్‌ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ శ్రవణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ యాదవులకు జీవనాధారం కోసం గొర్రెలను పంపిణీ చేయడం హర్షించదగిన విషయమన్నారు. పేదల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎన్నో బృహత్తర పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందని అన్నారు. ఎం.అంజయ్య, నల్లబోతు వెంకటేశ్వర్లు, రవిశంకర్‌, పగడాల సైదులు, కళమ్మ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana