e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home జిల్లాలు కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలి

కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలి

కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలి

ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వేణు, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ
జిల్లా జైల్‌లో సిద్ధం చేసి ఆహారం కొవిడ్‌ పేషెంట్లకు పంపిణీ

నీలగిరి, మే 26 : కరోనా పేషెంట్లు వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కోవాలని ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.వేణు, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ సూచించారు. జిల్లా జైల్‌లో తయారుజేసిన ఆహార ప్యాకెట్లను జిల్లా ప్రభుత్వ దవాఖానలో బుధవారం వారు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్ధ ఆదేశాల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ్ధ, నల్లగొండ జిల్లా పరిపాలనా యంత్రాంగం, Nalgonda.org(నల్లగొండ ఎన్‌ఆర్‌ఐ ఫోరం) సహకారంతో ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. నల్లగొండ ఎన్‌ఆర్‌ఐ ఫోరం కోఆర్డినేటర్‌ మిట్టపల్లి సురేశ్‌గుప్తా మాట్లాడుతూ జైలులో తయారుచేసిన ఆహారాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానలో పేషెంట్లకు లాక్‌డౌన్‌ ముగిసే వరకు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ చైర్మన్‌ శరత్‌చంద్ర, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది, నల్లగొండ ఎన్‌ఆర్‌ఐ సంస్ధ వలంటీర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బచ్చలకూరి శరత్‌చంద్ర, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాథోడ్‌ జైసింగ్‌ దవాఖాన సిబ్బంది తదితరులు ఉన్నారు.
పారిశుధ్య కార్మికులకు అన్నదానం
నార్కట్‌పల్లి: స్థానిక గ్రామపంచాయతీ కార్మికులకు టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు ప్రజ్ఞాపురం రామకృష్ణ అన్నదానం నిర్వహించారు. కార్యక్ర మంలో మాజీ సర్పంచ్‌ పుల్లెంల అచ్చాలు, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, పాశం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు
పండ్ల పంపిణీ
విశ్వహిందూ పరిషత్‌ బజరంగ్‌ దళ్‌ ఆధ్వర్యంలో చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద యాచకులు, గోశాలలో గోమాతలకు అరటి పండ్లు అందించారు. కార్యక్రమంలో శిగ లింగస్వామి, అందోజు మహేందర్‌, అద్దంకి శ్రీశైలంచారి, బి వెంకటేశ్వర్లు, భీంరావ్‌ పాల్గొన్నారు.
గుడ్లు, కూరగాయలు..
నల్లగొండ రూరల్‌ : మండలంలోని జీచెన్నారం గ్రామంలో కరోనా పేషెంట్లకు సర్పంచ్‌ ఉప్పునూతల వెంకన్న సొంత ఖర్చుతో కరోనా సోకిన 20 మందికి 30 గుడ్లు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పేషెంట్లు అధైర్యపడకుండా ఉండాలన్నారు. ఉప సర్పంచ్‌ ప్రేమలత, జిల్లాపల్లి నరసింహా, శైలజ,శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు ఫేస్‌షీల్డ్‌లు అందజేత
చిట్యాల : మానవ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యం లో అందించిన ఫేస్‌ షీల్డ్‌లను మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి పోలీసులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రావుల నాగరాజు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కూరెళ్ల లింగస్వామి, హెచ్‌ఆర్‌సీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు పోలేపల్లి సత్యనారాయణ, బాధ్యులు మేడి నరేశ్‌, దాత గ్యార ఇస్తారి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రుద్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ..
కనగల్‌ : మండలంలోని జి యడవల్లి, అమ్మగూడెం, బోయినపల్లి, రేగట్టే, కనగల్‌, చినమాదరం, చెట్లచెన్నారం, బాలసాయిగూడెం, కురంపల్లి, పొనుగోడు, దర్వేశిపురం, జంగమయగూడెం, బచ్చన్నగూడెం గ్రామాల్లో కనగల్‌ గ్రామానికి చెందిన పులకరం అమరేందర్‌ రుద్రరాజు ఆధ్వర్యంలో రుద్ర ఫౌండేషన్‌ సహకారంతో మాస్కులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తిరందాసు కనకయ్య, కొర్వి శ్రీనివాస్‌, దుబ్బ దేవేందర్‌, ఏల్లేశ్‌, కొర్వి నాని, బైరగోని అశోక్‌, వట్టికోటి దుర్గ, కలకూరి నాగరాజు, నరేందర్‌, ప్రేమ్‌ తదితరులున్నారు.
సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ
కనగల్‌ : మండలంలోని దోరేపల్లి, చర్లగౌరారం గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని సర్పంచులు ఐతగోని యాదయ్యగౌడ్‌,చింతల యాదగిరి పిచికారీ చేయించారు. కార్యక్రమాల్లో ఉపసర్పంచ్‌ దాసరి వెంకన్న, కార్యదర్శి చిట్టయ్య, వార్డు సభ్యులు తదితరులున్నారు. చర్లగౌరారంలో సర్పంచ్‌ కొవిడ్‌ పేషెంట్లకు ఆహార ప్యాకెట్లు అందజేశారు.
ఎట్టమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
నార్కట్‌పల్లి : మండలంలోని తొండల్‌వాయి గ్రామానికి చెందిన ఎట్టమ్మ కరోనాతో మృతి చెందడంతో ఆమె కుటుంబానికి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌ రెడ్డి రూ. 5 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌తో మృతి చెందిన కుటుంబాలకు దహన సంస్కారాల కోసం రూ.5 వేలు అందజేస్తానని, వారి కుటుంబాలను ఆదుకుంటూ అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను అందించేందుకు కృషి చేస్తానన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలి

ట్రెండింగ్‌

Advertisement