e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home నల్గొండ దవాఖానల్లో మందులకు కొరత లేదు

దవాఖానల్లో మందులకు కొరత లేదు

దవాఖానల్లో మందులకు కొరత లేదు

నందికొండ, మే 25: ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ ఆదేశించారు. హిల్‌కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. వార్డులలో ఉన్న కరోనా పేషెంట్లకు అందుతున్న సేవలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడతూ ఏరియా దవాఖానలో మందులకు కొదువ లేదని, వైద్యులు సైతం ఉత్తమ సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో వచ్చే రోగులకు వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించి వైద్యం అందించాలని సూచించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి, డాక్టర్లు హరికృష్ణ, చక్రవర్తి ఉన్నారు.

ఈ-పాస్‌ ఉంటేనే అనుమతించాలి
అనుమతులు ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి రానివ్వాలని ఎమ్మెల్యే భగత్‌కుమార్‌ పోలీసులకు సూచించారు. నందికొండ పైలాన్‌కాలనీలోని తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మంగళవారం సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేయడం వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారిని నియంత్రించాలని సూచించారు.

ఐసొలేషన్‌ కేంద్రం ప్రారంభం
త్రిపురారం : మండలంలోని పెద్దదేవులపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే నోముల భగత్‌ మంగళవారం ప్రారంభించారు. కరోనా పేషెంట్లకు ఆహారం, మందులు అందిస్తున్న రెడ్డీస్‌ల్యాబ్‌ వారిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్‌ జానకీరాములు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్‌, ఎంపీటీసీ అంబటి రాము, సర్పంచ్‌ బాల రాణి, నాయకులు మర్ల చంద్రారెడ్డి, వెం కన్న, వెంకటాచారి, సతీశ్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ
హాలియా : తిరుమలగిరి సాగర్‌ మండల కేంద్రానికి చెందిన ఎస్‌. కోటిరెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ. 36వేల చెక్కును మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్‌ అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రవణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే భగత్‌కు సన్మానం
నిడమనూరు: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ కుమార్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్‌, పార్వతీపురం సర్పంచ్‌ వంకా బ్రహ్మన్న, శాఖాపురం ఉప సర్పంచ్‌ తిరుపతయ్యచారి, మండల పరిషత్‌ సలహాదారుడు బొల్లం రవి యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దవాఖానల్లో మందులకు కొరత లేదు

ట్రెండింగ్‌

Advertisement