e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home నల్గొండ మహిళాభ్యున్నతికి ప్రభుత్వ ప్రాధాన్యం

మహిళాభ్యున్నతికి ప్రభుత్వ ప్రాధాన్యం

మహిళాభ్యున్నతికి ప్రభుత్వ ప్రాధాన్యం

త్రిపురారం, జూన్‌21 : మహిళాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నదని నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. మండలంలోని త్రిపురారం, పెద్దదేవులపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎస్‌హెచ్‌జీ స్టోర్‌ను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వస్తువులను బైరిసన్‌ సంస్థ సేకరించి మార్కెట్‌ సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం మం డల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన జయశంకర్‌ సార్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని సార్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే భగత్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ కాళిందిని, డీపీఎం మోహన్‌రెడ్డి, ఏపీడీ సరస్వతి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ ఇస్లావత్‌ రాంచందర్‌నాయక్‌, ఎంపీపీ అనుముల పాండమ్మా శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ అలివేలుమంగమ్మ, మార్కెట్‌ చైర్మన్‌ కామెర్ల జానయ్య, బైరిసన్‌ డీఎం బైరెడ్డి, ఏపీఎం దిలీప్‌కుమార్‌, సర్పంచ్‌ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నరేందర్‌, నాయకులు చంద్రారెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌, నరేందర్‌, తాహేరాబేగం పాల్గొన్నారు.

సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ
హాలియా/తిరుమలగిరి(సాగర్‌) : తిరుమలగిరి సాగర్‌ మండలం శ్రీరాంపురం, ధన్‌సింగ్‌తండాకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను సోమవారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే భగత్‌ అందజేశారు.

- Advertisement -

టీఆర్‌ఎస్‌ కార్యకర్త కుటుంబానికి పరామర్శ
హాలియా : మదారిగూడెం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు పోశం శ్రీనివాస్‌గౌడ్‌ తల్లి ఎల్లమ్మ సోమవారం మృతి చెందగా..ఎమ్మెల్యే నోముల భగత్‌ ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళుల ర్పించారు. శ్రీనివాస్‌ గౌడ్‌ను పరామర్శించి సంతాపం తెలిపారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ ఇరిగి పెద్దులు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, ఆవుల పురుషోత్తం, సర్పంచ్‌ కుందారపు సైదులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మహిళాభ్యున్నతికి ప్రభుత్వ ప్రాధాన్యం
మహిళాభ్యున్నతికి ప్రభుత్వ ప్రాధాన్యం
మహిళాభ్యున్నతికి ప్రభుత్వ ప్రాధాన్యం

ట్రెండింగ్‌

Advertisement