e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home నల్గొండ పదో తరగతి ఫలితాలు విడుదల

పదో తరగతి ఫలితాలు విడుదల

  • ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్లు
  • ఉమ్మడి జిల్లాలో మొత్తం 43,507మంది విద్యార్థులు
  • కరోనా నేపథ్యంలో అందరూ పాస్‌
  • పాఠశాల నుంచే పాస్‌ సర్టిఫికెట్‌
పదో తరగతి ఫలితాలు విడుదల

రామగిరి, మే 21 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పదో పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గత సంవత్సరం ఈ ఏడాది కూడా వార్షిక పరీక్ష ఫీజు చెల్లించి రిజస్టర్‌ చేసుకున్న విద్యార్థులందరినీ ఉత్తీర్ణులు చేసింది. వారికి నిర్వహించిన ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ) పరీక్షల ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులు చేస్తూ.. అందుకు సంబంధించిన ఫలితాలు, మార్కుల జాబితాలను రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో ఉత్తీర్ణులయ్యారు. అందులో 19,226 మంది 10/10 జీపీఏ సాధించారు.
పదో తరగతి విద్యార్థులకు కరోనా నేపథ్యంలో పర్యాయం ఆన్‌లైన్‌, 2021 ఫిబ్రవరి, మార్చిలో తరగతులు జరిగాయి. వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉండడంతో పరీక్షలను ఫ్రభుత్వం రద్దు చేసింది. అయితే.. మార్చిలో విద్యార్థులకు నిర్వహించిన ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ) పరీక్షల 20శాతం మార్కుల ఆధారంగా గ్రేడ్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు నిర్ణయిస్తూ ఫలితాలు విడుదల చేశారు. మార్కుల జాబితాలు www.bse.telangana.gov.inలో అందుబాటులో ఉంటాయని డీఈఓ బి.భిక్షపతి తెలిపారు. వెబ్‌సైట్‌ నుంచి మార్కుల జాబితాను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. పాస్‌ సర్టిఫికెట్‌ను ప్రధానోపాధ్యాయుల లాగిన్‌ నుంచి పొందాలన్నారు.
ఫలితాలు ఇలా…

ఉమ్మడి 2020-21 విద్యా సంవత్సరంలో మంది విద్యార్థులు పదో వార్షిక పరీక్ష ఫీజు చెల్లించి రిజిస్టర్‌ చేసుకున్నారు. ఎఫ్‌ఏ పరీక్షల ఆధారంగా వారంతా ఉత్తీర్ణత సాధించినట్లు ఆన్‌లైన్‌లో మార్కుల జాబితాతోపాటు ఫలితాలు విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో 10,641 మంది బాలురు, 10,036 మంది బాలికలు కలిపి మొత్తం 20,677 మంది విద్యార్థులు జిల్లాలో 12,743 మంది విద్యార్థులుండగా.. 6,539 మంది బాలురు, 6,204 మంది బాలికలు ఉన్నారు.
సవరణకు అవకాశంపదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్‌లో విద్యార్థికి సంబంధించిన వివరాలు తప్పుగా ఉంటే సవరణ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు పుట్టిన తేదీ, పుట్టుమచ్చలు, ఇతర వివరాలను సరిచేసుకోవచ్చు. అయితే.. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, డీఈఓ ద్వారా ప్రభుత్వ పరీక్షల సంచాలకుడికి సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఈ అవకాశం ఉండేదికాదు. ఈ పర్యాయం మాత్రమే దీనికి అవకాశం ఇచ్చారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పదో తరగతి ఫలితాలు విడుదల

ట్రెండింగ్‌

Advertisement