e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home నల్గొండ అర్హులందరికీ రేషన్‌ కార్డులు

అర్హులందరికీ రేషన్‌ కార్డులు

అర్హులందరికీ రేషన్‌ కార్డులు
  • దరఖాస్తుల వెరిఫికేషన్‌ త్వరగా పూర్తిచేయాలి
  • దేశంలోనే రికార్డు స్థాయిలో మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ
  • మద్దతు ధర అందిస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణ
  • పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల

నల్లగొండ, జూన్‌ 18 : రేషన్‌ కార్డు దరఖాస్తుల వెరిఫికేషన్‌ త్వరగా పూర్తిచేసి అర్హులందరికీ కార్డులు మంజూరు చేయాలని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రేషన్‌ కార్డుల మంజూరు, యాసంగి ధాన్యం సేకరణపై కరీంనగర్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో శుక్రవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రేషన్‌ దరఖాస్తులను వెంటనే పరిశీలించి జాబితాను వారం రోజుల్లో పంపాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే స్మార్ట్‌ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తుందన్నారు. ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణ డీలర్ల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు.

యాసంగి సీజన్‌లో 80లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా అంతకుమించి 90లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా సేకరించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వరి సాగు గణనీయంగా పెరిగిందన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వరి ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించడం లేదని, ఒక్క తెలంగాణలోనే మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేశామని తెలిపారు. కరోనా సమయంలో అన్ని ఇబ్బందులను అధిగమించి ధాన్యం సేకరణలో సహకరించిన అధికారులు, సహకార సోసైటీలు, మహిళా సంఘాలు, హమాలీలకు మంత్రి కమలాకర్‌ ధన్యవాదాలు తెలిపారు. నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జిల్లాలో రేషన్‌ కార్డులకు 17,488 దరఖాస్తులు వచ్చాయని, వెరిఫికేషన్‌ నిర్వహిస్తామని తెలిపారు. 75 రేషన్‌ దుకాణాలకు డీలర్లు లేరని, ప్రభుత్వ ఆదేశాల మేరకు భర్తీకి చర్యలు తీసుకుంటామని అన్నారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, సివిల్‌ సప్లయ్‌ డీఎం నాగేశ్వర్‌రావు

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అర్హులందరికీ రేషన్‌ కార్డులు
అర్హులందరికీ రేషన్‌ కార్డులు
అర్హులందరికీ రేషన్‌ కార్డులు

ట్రెండింగ్‌

Advertisement