e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home నల్గొండ అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

హాలియా, జూన్‌ 17 : అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతి నిధుల వేతనాలు 30 శాతం పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా వేతనాలు పెంచడం హర్షణీయమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలోనే స్థానిక సంస్థలు బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, ఎంపీపీ పేర్ల సుమతీపురుషోత్తం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, వైస్‌ చైర్మన్‌ నల్లగొండ సుధాకర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రావుల రాంబాబు, మండలాధ్యక్షుడు ఉర్లగొండ వెంకటయ్య, ఎంపీటీసీ రమేశ్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వి. శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు వర్రా వెంకట్‌రెడ్డి, అన్నెపాక శ్రీను, ప్రసాద్‌ నాయక్‌, సైదులు, నాయకులు నరేందర్‌రావు, వెంకటేశ్వర్లు, నాగరాజు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
హాలియా : మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. గురువారం జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చైర్‌పర్సన్‌ వెంపటి పార్వతమ్మాశంకరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం
నందికొండ : ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులు కల్పించడంతో పాటు మెరుగైన వైద్యం అందేలా సర్కారు చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ అన్నారు. నందికొండ హిల్‌కాలనీ కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో రూ. 7.25 లక్షల వ్యయంతో మంజూరైన నూతన జనరేటర్‌ను గురువారం ఏర్పాటు చేశారు. పనులను ఎమ్మెల్యే పర్యవేక్షించారు. అనంతరం దవాఖానను తనిఖీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి, వైస్‌ చైర్మన్‌ మంద రఘువీర్‌, కౌన్సిలర్లు ఇర్ల రామకృష్ణ, రమావత్‌ మంగ్తానాయక్‌, నిమ్మల ఇందిరాగౌడ్‌, హిరేకార్‌ రమేశ్‌జీ, నాయకులు ఆదాసు విక్రమ్‌, మోహన్‌నాయక్‌, భూషరాజుల కృష్ణ, దవాఖాన సీఎంఓ భానుప్రసాద్‌, డాక్టర్లు చక్రవర్తి, ఆరవింద్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

ట్రెండింగ్‌

Advertisement