e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home నల్గొండ కాంగ్రెస్‌కు ఓటేస్తే పేనుకు పెత్తనమిచ్చినట్టె..

కాంగ్రెస్‌కు ఓటేస్తే పేనుకు పెత్తనమిచ్చినట్టె..

కాంగ్రెస్‌కు ఓటేస్తే పేనుకు పెత్తనమిచ్చినట్టె..

నిడమనూరు, మార్చి 16 : “సైదక్కా.. ఓ సైదక్కా… ఏం జేస్తున్నవ్‌..? పొద్దుగాలసంది అగుపడ్లేదు.. ఇంట్లంచి బైటికిరాలే..” అంటూ సైదక్క ఇంటి ముందున్న అరుగు మీద జారగిలబడ్డది రాములమ్మ. ‘ఆ.. ఉన్ననే రాములమ్మ… నేను ఏడకు బోతనే.. పొద్దుగాలకెళ్లి ఆల్లుఈల్లు వచ్చిపోతుంటే సూసుకుంట కూసున్న. గిప్పుడే బర్ల పాలు పిండి బైటికొస్తున్న..’ “గియ్యాల ఎలచ్చన్‌ డేటు వచ్చిందట సైదక్కా.. ఊళ్లె అందరూ అదే మాట్లాడుకుంటున్నరు..” 

‘అవునా… కేసీఆర్‌ సారు గవర్నమెంటు రైతు బంధు, రైతు బీమా పథకాలిచ్చె.. ఆటిని జూసి నర్సింహయ్యను గెలిపిస్తిమి. పాపం ఆయనేమో పానం బాగలేక జీవిడిసె..’ సీఎం కేసీఆర్‌ సారు రైతులను, పింఛన్లు ఇచ్చి పేదోళ్లను బాగనే ఆదుకున్నడు. ఏం తక్కువ జేసిండు మనకు..?! గిన్నేండ్లు మంత్రిగ పనిజేసిన జానారెడ్డి చేసిందేమీ లేకపాయె. గిప్పుడు మళ్లా ఎలచ్చన్లు వచ్చినయ్‌గ ఎన్నడు రాని జానారెడ్డి ఓట్ల కోసం ఆసుపోసినట్లు దిరగబట్టె. ఇన్నేండ్లళ్ల చేసిందేం లేకపోయినా ఆర్భాటం మాత్రం బిర్రుగ జేస్తున్రు..’

“ఆం ఏం దిరుగుడు లే.. గిన్నేండ్లల్ల మంత్రిగ ఉండుకుంట గూడ మన పిల్లలకు ఒక్క కాలేజీ కట్టియ్యకపాయె.. రోడ్లు సక్కగ లేకపాయె.. ఏదన్నా సమస్య జెప్పుకుందమన్నా పట్నంల ఉండుకుంట ‘ఆడికి పో.. ఈడికి పో’ అని మాట్లాడనియ్యకుండె.. పెత్తనమంతా ఊర్లళ్ల నాయకులు జేసి జనాలకు ఏం చేయకపాయె.. గీల్లకు మల్లెట్లేస్తరు ఓట్లు.. కాంగ్రేసోళ్ల రోజుల్ల ఆళ్లు చెప్పినోళ్లకే పింఛన్లు, ఆళ్లు చెప్పినోళ్లకే ఇండ్లు.. మన సొంటోళ్లకు ఏ పనైనా అయితుండెనా..? కానీ, కేసీఆర్‌ సారు సర్కారు వచ్చినంక ఎవలతో పనిలేకుంటనే అధికార్లే వచ్చి సూసుకుని రాసుకోని పోయి మంజూరు ఇస్తుండె.. బోకర్ల సుట్టూ తిరిగే బాధలు తీర్చి మన పేదోల్లకు అన్ని జేయవట్టె… ఇంతకంటె ఏం గావాల్నె..? ఎమ్మెల్యే నర్సింహయ్య ముఖ్యమంత్రి సహాయనిధి సాయం శానామందికి ఇప్పిచ్చిండు… ఊళ్లళ్ల మాబాగ తిరుగుతుండె… తిరుగుత తిరుగుతానే సచ్చిపాయె… అమ్మ బాగున్నరా అని మనబోటి పేదోళ్లను నోరారా పిలుస్తుండె.. పాపం గియ్యాల లేకపాయె… పానం ఉసూరుమంటున్నది. కాంగ్రెస్సోళ్లకు పెత్తనమిస్తే పేనుకు పెత్తనమిచ్చినట్టె.. తెల్వందా మనకి..’

‘మనూరు నుంచి మండలాఫీసుకు పోదామంటె బస్సు లేకపాయె. గిన్నేండ్లు మంత్రి పదవి ఎలగబెట్టి జానారెడ్డి జేసిందేముందె..’ 

“మళ్లా ఎలచ్చన్లొచ్చినయ్‌ నెల రోజులు తిరునాళ్ల లెక్క తిరుగుతరు.. జానారెడ్డి ఎమ్మటి అంత డబ్బున్న లీడర్లుండ్రు.. ఆయన గెలిస్తే మళ్లా ఆళ్ల మొత్తల కాడ మనం కావలిగాసుడే అయితది.. గిన్నేండ్లల్ల పెద్దోళ్ల ఇండ్లళ్లకు వచ్చిపోయిండు గాని మన బోటి పేదోళ్ల వంక జూసిన పాపాన పోలేదె.. మంత్రిగ పనిచేసినా మనకు ఏం ఒరగబెట్టిండు.. గిప్పుడు గీల్లకు సస్తె ఓటెయ్యొద్దు” 

‘అవును నువ్వు చెప్పింది నిజమే రాములమ్మా.. .. ఇంత కాలం మొఖం కనపడలె.. ఇప్పుడు తయారైండ్రు చూడు’  

– నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని ఓ పల్లెలో ఇద్దరు మహిళల సంభాషణ 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కాంగ్రెస్‌కు ఓటేస్తే పేనుకు పెత్తనమిచ్చినట్టె..

ట్రెండింగ్‌

Advertisement