e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home నల్గొండ 15న సీఎం కేసీఆర్‌కు దళితుల కృతజ్ఞత సభ

15న సీఎం కేసీఆర్‌కు దళితుల కృతజ్ఞత సభ

15న సీఎం కేసీఆర్‌కు దళితుల కృతజ్ఞత సభ

సూర్యాపేట టౌన్‌, జులై 13 : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన దళిత సాధికారత పథకాన్ని స్వాగతిస్తూ సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్‌హాల్‌లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు దళితుల కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం తెలిపారు. సూర్యాపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సభకు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా దళితులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో దళిత నాయకులు బొల్లెద్దు దశరథ, చింతలపాటి చిన్న శ్రీరాములు, బొల్లె జానయ్య, చిప్పలపల్లి జయశంకర్‌, చింతలపాటి భరత్‌, వల్దాస్‌ జానీ, ఊట్కూరి సైదులు పాల్గొన్నారు.
చివ్వెంల : కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని సూర్యాపేట మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఊట్కూరి సైదులు కోరారు. మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన జిల్లా నలుమూలల నుంచి దళితులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు కలకొండ శ్యాంసన్‌, సైదులు, సందీప్‌, విజయ్‌, గోపి, రవి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
15న సీఎం కేసీఆర్‌కు దళితుల కృతజ్ఞత సభ
15న సీఎం కేసీఆర్‌కు దళితుల కృతజ్ఞత సభ
15న సీఎం కేసీఆర్‌కు దళితుల కృతజ్ఞత సభ

ట్రెండింగ్‌

Advertisement