e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home నల్గొండ గడప గడపకూ జ్వర సర్వే

గడప గడపకూ జ్వర సర్వే

గడప గడపకూ జ్వర సర్వే

నల్లగొండ ప్రతినిధి, జూలై 13(నమస్తే తెలంగాణ) : కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ పలు చోట్ల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జ్వర సర్వే ముమ్మరం చేశారు. వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ సిబ్బంది సంయుక్తంగా కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణకు చెక్‌ పెట్టేలా కార్యాచరణలో భాగస్వామ్యం అవుతున్నారు. అందులో భాగంగా సోమవారం జిల్లాలో మూడో విడత జ్వర సర్వే ప్రారంభించారు. పాజిటివ్‌ రేటులో రాష్ట్ర సగటు 2.0 శాతం కాగా జిల్లాలో మాత్రం 2.5శాతం ఉన్నది. సాగర్‌, పెద్దవూర లాంటి పీహెచ్‌సీల పరిధిలో 4శాతం వరకు నమోదవుతున్నది. దీంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం మరోదఫా జ్వర సర్వే చేపట్టింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో సర్వే ముమ్మరంగా జరుగుతున్నది.

పాజిటివిటీ రేట్‌ తగ్గించడమే లక్ష్యంగా..
రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేట్‌ 2.0శాతం ఉన్నది. పొరుగు రాష్ర్టాలైన కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లో 5నుంచి 10శాతం, తమిళనాడు, కేరళలో 10శాతం పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దు జిల్లాగా ఉన్న నల్లగొండలోనూ రాష్ట్ర సగటు కంటే అదనంగా పాజిటివ్‌ రేటు నమోదవుతున్నది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు ప్రాంతాలైన నాగార్జునసాగర్‌, మిర్యాలగూడల్లో ఆదివారం ప్రత్యేకంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఆధ్వర్వంలో సమీక్ష నిర్వహించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దాంతో సోమవారం నుంచే జ్వరసర్వే మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో 4శాతంగా ఉన్న పాజిటివ్‌ రేటును తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు. ఏఏ గ్రామాల్లో కొవిడ్‌ కేసులు ఎక్కువగా వస్తున్నాయి..? వాటికి కారణాలు ఏమిటి..? అనే అంశాలను వైద్యారోగ్యశాఖ, డాక్టర్లు పరిశోధిస్తున్నారు. పీహెచ్‌సీల పరిధిలో నమోదైన పాజిటివ్‌ కేసులు, దవాఖానల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య, వ్యాప్తికి కారణాలు, నియంత్రణలు, ప్రజల వ్యవహారశైలి తదితర అంశాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే జ్వర సర్వే నిర్వహించి ప్రాథమిక దశలోనే ప్రజలను అప్రమత్తం చేయడం, అవసరాన్ని బట్టి మెడికల్‌ కిట్స్‌ అందించడం, తీవ్రతను బట్టి స్టెరాయిడ్స్‌, ఆపై పరిస్థితికి అనుగుణంగా వైద్యశాలకు తరలించడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. సీజనల్‌ వ్యాధులు, వైరల్‌ ఫీవర్స్‌కు కూడా అవకాశాలు ఉండడంతో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్యారోగ్యశాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు.

- Advertisement -

వెయ్యి ఇండ్లకు ఒక బృందం..
గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వారీగా ప్రతి వెయ్యి ఇండ్లకు ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో 182బృందాలు, 844 గ్రామ పంచాయతీల పరిధిలో 1,223బృందాల చొప్పున మొత్తం 1,405బృందాలను సిద్ధం చేశారు. ఈ బృందంలో ఆశ వర్కర్‌, అంగన్‌వాడీ టీచర్‌, గ్రామ పంచాయతీ/మున్సిపల్‌ సిబ్బందిని నియమించారు. నల్లగొండ, మిర్యాలగూడ లాంటి పెద్ద పట్టణాలతో పాటు మేజర్‌ గ్రామ పంచాయతీల్లో అదనపు సిబ్బందిని కేటాయించారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీల్లో ముగ్గురితో కూడిన బృందాలు సర్వేలో పాల్గొనేలా చర్యలు చేపట్టారు.

1.78లక్షల గృహాల సర్వే పూర్తి..
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండ్రోజుల్లో 1,78,878గృహాలను పూర్తి చేశారు. సూర్యాపేట జిల్లాలో 61,481 నివాసాలలో సర్వే నిర్వహించగా 608 మందిని గుర్తించి జ్వర కిట్లు అందించినట్లు జిల్లా వైద్యాధికారి డా.కోటాచలం తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబువంటి అనారోగ్యంతో పాటు కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ దవాఖానకు పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణ జ్వరం, జలుబు, దగ్గు ఉంటే మందులు అందించి మూడు రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతున్నారు. అయినప్పటికీ తగ్గకుంటే వెంటనే వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ కరోనా పరీక్షలు చేయించి కరోనా కిట్లు అందిస్తారు. పాజిటివ్‌ వచ్చి ఇంటి వద్దే ఉంటున్న వారికి హెల్త్‌కిట్‌ అందిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ సహకరించాలి
ఇతర రాష్ర్టాల నుంచి ప్రజల రాకపోకలు అధికంగా ఉండడంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ రేటు రాష్ట్ర సగటు కంటే 0.5శాతం అధికంగా ఉన్నది. దీనికి తోడు వర్షాలు కురుస్తుడడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జిల్లాలో మూడో దఫా జ్వరసర్వేను ప్రారంభించాం. ప్రజలు భయబ్రాంతులకు గురికాకుండా ఇంటింటికీ వచ్చే వైద్య సిబ్బందికి పూర్తి సమాచారం ఇవ్వాలి. దీంతో మరింత వైద్య సహాయం అందించేందుకు వీలు కలుగుతుంది.

  • డా.అన్నిమళ్ల కొండల్‌రావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, నల్లగొండ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గడప గడపకూ జ్వర సర్వే
గడప గడపకూ జ్వర సర్వే
గడప గడపకూ జ్వర సర్వే

ట్రెండింగ్‌

Advertisement