e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home నల్గొండ ప్రభుత్వ పాఠశాల్లో వసతులపై ఆరా

ప్రభుత్వ పాఠశాల్లో వసతులపై ఆరా

ప్రభుత్వ పాఠశాల్లో వసతులపై ఆరా

రామగిరి, జూలై 11 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా సర్కారు ముందుకు సాగుతున్నది. ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తుండగా, మౌలిక వసతుల కల్పనకు ఆయా పాఠశాలల్లో సౌకర్యాలపై ఆరా తీస్తున్నది. ప్రత్యేకంగా ఎస్‌ఐఎస్‌( స్కూల్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌) యాప్‌ను రూపొందించి అందుబాటులోకి తెచ్చింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వసతుల ఫొటోలను నమోదు చేయాల్సి ఉంటుంది. సోమవారం నుంచి పాఠశాలలు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. యాప్‌లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు వారి పాఠశాలల వివరాలను నమోదు చేయాల్సి ఉంది.

నమోదు చేసే వివరాలు ఇవే ..
పాఠశాల ఆవరణ, రూమ్స్‌(తరగతి గదులు), టాయిలెట్స్‌, డ్రింకింగ్‌ వాటర్‌ వసతి, కిచెన్‌ షెడ్డు, ప్రహరీ మొత్తం పాఠశాల ఆవరణ కొలతలు, వాటి వీడియోలు నమోదు చేయాల్సి ఉంది.

- Advertisement -

డౌన్‌లోడ్‌ ఇలా…
గూగుల్‌ ఫ్లే సోర్‌ నుంచి School Infra Statur (SIS) అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
యూజర్‌ ఐడీ, యూ-డైస్‌ కోడ్‌, పాస్‌వర్డ్‌(ఆయా పాఠశాలలు యూ-డైస్‌ కోసం పెట్టుకున్న పాస్‌వర్డ్‌) నమోదు చేసి లాగిన్‌ కావాలి.
మొదట అందులో పాఠశాల ప్రాథమిక వివరాలు కనబడతాయి. వీటిని ఎడిట్‌ చేయడానికి అవకాశం ఉండదు.
తర్వాత 7 బటన్స్‌ కనిపిస్తాయి వాటిలో రూమ్స్‌, టాయిలెట్స్‌, డ్రింకింగ్‌ వాటర్‌, కిచెన్‌షెడ్డు, జియో ఫెన్సింగ్‌, ప్రహరీ వీడియో ఉంటాయి.
వీటిలో తొలుత రూమ్స్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే తరగతి గదులు, ప్రధానోపాధ్యాయుడి గది, స్టాఫ్‌రూమ్‌, ఇతర గదులు అనే ఆప్షన్స్‌ వస్తాయి. వీటిలో ముందుగా క్లాస్‌రూమ్స్‌ సెలెక్ట్‌ చేసుకుని యూ-డైస్‌లో ప్రకారం వాటి వివరాలు వస్తాయి. తర్వాత తరగతి గదిని సెలెక్ట్‌ చేసుకుని 8 ఫొటోలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం గోడలు, శ్లాబ్‌, ఫ్లోరింగ్‌, ఇన్నర్‌, అవుటర్‌ వాల్‌ ఫొటోలను తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఇలా ఎన్ని తరగతి గదులుంటే వాటిని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
తర్వాత మిగిలిన వివరాలు నమోదు ప్రాధాన్యత ప్రకారం ఫొటోలు ఆప్‌లోడ్‌ చేయాలి.
కంపౌండ్‌ వాల్‌కు సంబంధించి నాలుగు ఫొటోలు అంటే ముందుభాగం, లోపలిభాగం, పూర్తి గోడ అప్‌లోడ్‌ చేయాలి.
అదే విధంగా జీఓ ఫెన్సింగ్‌ బటన్‌ క్లిక్‌చేసి అందులో అడిగిన వివరాలు నమోదు చేయాలి.
తర్వాత పాఠశాల, కంపౌండ్‌ వాల్‌ లోపల, బయటకు సంబంధించి 20 సెకండ్లు తగ్గకుండా వీడియోలు తీసి నమోదు చేయాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రభుత్వ పాఠశాల్లో వసతులపై ఆరా
ప్రభుత్వ పాఠశాల్లో వసతులపై ఆరా
ప్రభుత్వ పాఠశాల్లో వసతులపై ఆరా

ట్రెండింగ్‌

Advertisement