e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిల్లాలు అధైర్యపడొద్దు.. అండగా ఉంటా

అధైర్యపడొద్దు.. అండగా ఉంటా

అధైర్యపడొద్దు.. అండగా ఉంటా

నకిరేకల్‌ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట మండలం వెల్లంకిలోఇంటింటికీ తిరిగి కరోనా బాధితులకు పరామర్శ

రామన్నపేట, జూన్‌ 9: అధైర్యపడొద్దు అండగా ఉంటానని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని వెల్లంకిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువ గా ఉన్న సమాచారం తెలుసుకుని కరోనా బాధితుల ఇంటిం టికీ వెళ్లి వారిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, వైద్యు ల సూచించిన మందులను, వారి సలహాలను పాటించాలన్నా రు. అనంతరం గ్రామంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వెల్లంకిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని దీనికి వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు. రెండు గంటల తరువాత ఇండ్ల నుంచి ఎవరూ బయటికి రాకుండా పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైన వారికి ప్రభుత్వ పాఠశాలలో హోం ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చే యాలని కోరారు. రామన్నపేట ప్రభుత్వ దవాఖానలో ఐసోలే షన్‌ వార్డులో 24బెడ్లు ఎర్పాటు చేసి వైద్య సిబ్బందిని నియ మించామని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎడ్ల మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ తిమ్మా పురం మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో జలందర్‌రెడ్డి, తహసీల్దార్‌ ఆంజనేయులు, మండల వైద్యాధికారి రవికుమార్‌, నాయకు లు పున్న జగన్‌, కన్నెబోయిన బలరాం, ఎడ్ల నరేందర్‌రెడ్డి, కర్రె రమేష్‌ ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సాయం అందజేత
వెల్లంకి గ్రామానికి చెందిన చెన్నోజు మల్లెశ్‌ ఇటీవల కరోనాతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం వారి కుటుంబ సభ్యులను పరామ ర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు.
మోత్కూరులో 114మందికి వ్యాక్సిన్‌
మోత్కూరు: మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం మోత్కూరు, గుండాల, అడ్డ గూడూరు మండలాల పరిధిలోని 80 మంది సూపర్‌స్ప్రెడర్లకు మొదటి డోస్‌ కోవిషీల్డ్‌, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 34 మందికి రెండో డోస్‌ కోవాగ్జిన్‌ వాక్సిన్‌ను వేసినట్లు వైద్యాధి కారి డాక్టర్‌ ఆకవరం చైతన్యకుమార్‌ తెలిపారు.
వైద్య సిబ్బందికి మాస్క్‌లు, గ్లౌజ్‌లు పంపిణీ
బొమ్మలరామారం: మండల కేంద్రంలోని వైద్య సిబ్బందికి రోటరీ క్లబ్‌ అఫ్‌ భువనగిరి వారి అధ్వర్యంలో కెపాల్‌ బోన్స్‌ సె ట్టింగ్‌ సెంటర్‌ మాజీ అసిస్టెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ ఎంపల్ల బుచ్చి రెడ్డి సహకారంతో బుధవారం మాస్కులు, గ్లౌజులు మండల వైద్యాధికారి శ్రావణ్‌ కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో రోటరీక్లబ్‌ సభ్యుడు, మండలప్రజా పరిషత్‌ పర్యవేక్షకుడు జ్ఞాన ప్రకాశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
తుర్కపల్లి: ప్రజారోగ్యంపై వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వ హించాలని పిలుపు సంస్థ డైరెక్టర్‌ రుద్రమదేవి అన్నారు. మం డల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం రైతు స్వరాజ్యవేదిక సహకారంతో, పిలుపు సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల ఆశవర్కర్లకు, పీహెచ్‌సీ సిబ్బం దికి థర్మల్‌ స్క్రీనింగ్‌, పల్స్‌ఆక్సీమీటర్లు అందజేశారు. కార్యక్ర మంలో వైద్యాధికారి చంద్రారెడ్డి, రైతు స్వరాజ్య వేదిక జిల్లా కోఆర్డినేటర్‌ గోవర్దన్‌, మహిపాల్‌, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల పంపిణీ
భువనగిరి కలెక్టరేట్‌: బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారా యణరెడ్డి సౌజన్యంతో బుధవారం డీసీపీ కార్యాలయానికి, బీ జేపీ పట్టణ పార్టీకి కలిపి నాలుగు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు నారాయణరెడ్డిని డీ సీపీ నారాయణరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో అడిషన ల్‌ఎస్పీ భుజంగరావు, సీఐసుధాకర్‌, నాయకులు పాల్గొన్నారు.
కొవిడ్‌ బాధితులకు మెడికల్‌ కిట్ల పంపిణీ
మోత్కూరు: మండలంలోని పొడిచేడులో కొవిడ్‌ బాధిత కు టుంబాలకు హైదరాబాద్‌కు చెందిన రాజమాత పౌండేషన్‌ స హకారంతో మోత్కూరు ఎస్సై ఉదయ్‌కిరణ్‌ థర్మామీటర్‌, ఆక్సి మీటర్‌, మందులతో కూడిన మెడికల్‌ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మధు, ఉప సర్పంచ్‌ వెంకటేశం, రైతు సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా

ట్రెండింగ్‌

Advertisement