e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home జిల్లాలు మాస్క్‌తో కసరత్తా! వద్దే వద్దు

మాస్క్‌తో కసరత్తా! వద్దే వద్దు

మాస్క్‌తో కసరత్తా! వద్దే వద్దు

ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయే ప్రమాదం
రక్తంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ వృద్ధి
జిమ్‌లో జాగ్రత్తలు తప్పనిసరి
కసరత్తు చేస్తున్నప్పుడు ఆక్సిజన్‌ సరఫరా అవసరం
కొవిడ్‌ వేళ జిమ్‌లో జాగ్రత్తలు తప్పనిసరి

సిటీబ్యూరో, ఏప్రిల్‌ 28 (నమస్తేతెలంగాణ) : ఫిట్‌గా లేకపోతే కొవిడ్‌ సులభంగా అటాక్‌ చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పెంచుకోవడంతోపాటు శారీరక వ్యాయామం చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో నగరవాసులు జిమ్‌ సెంటర్లలో చెమటలు చిందిస్తున్నారు. బరువులు మోస్తున్నారు.. గుంజీలు తీస్తున్నారు. నిమిషాల కొలదీ నడుము వంచుతున్నారు. అమ్మాయిలు, యువకులు ఇలా అందరూ వారి శక్తికి మించి వ్యాయామం చేస్తున్నారు. అందులో ఆరోగ్యం కోసం..శరీర ఆకృతి కోసం.. మరికొందరు కండల కోసం. అయితే వీరందరూ మాస్క్‌ ధరించి వ్యాయామం చేస్తున్నారు.

మాస్క్‌తో
వ్యాయామం వద్దు
వ్యాయామం సమయంలో చాలామంది మాస్క్‌ పెట్టుకోవడంతో వైరస్‌ నుంచి రక్షించుకుంటున్నామని భ్రమపడుతుంటారు. మాస్క్‌ ధరించి వ్యాయామం చేస్తే ఊపిరిత్తులు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ ఎక్కువగా అందదు. చాలామంది కరోనా భయంతో బిగుతుగా ఉన్న మాస్క్‌లు పెట్టుకుంటారు. అలా పెట్టుకుని వెయిట్‌ లిఫ్టింగ్‌ చేసిన సమయంలో, రన్నింగ్‌, జాగింగ్‌ చేసే సమయంలో ఏ గాలినైతే మనం వదులుతామో.. అదే గాలిని పీల్చుకుంటాం. దానివల్ల కార్బన్‌ డయాక్సైడ్‌ రక్తంలో వృద్ధి చెందుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం.

ఈ జాగ్రత్తలు పాటించాలి
మెడిసిన్‌ వాడుతున్న వారు వైద్యుల సూచనలేకుండా వ్యాయామం చేయకూడదు.
వ్యాయామం సమయంలో మాస్క్‌లు ధరించకూడదు.
సులభంగా మూవ్‌మెంట్‌ ఉండేలా డ్రెస్సు ధరించాలి.గాలి వీచేలా ఉండాలి.
ఏదైన వస్తువును తాకినప్పుడు చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి.
ఒకే రకమైన వ్యాయామం చేయడం ప్రమాదం.
హిమోగ్లోబిన్‌ నార్మల్‌గా ఉన్నప్పుడే వ్యాయామం చేయాలి.
ఒంటి నుంచి చెమట ఎంత వస్తే…శరీర క్రియాశీలక వ్యవస్థ మెరుగ్గా ఉన్నట్టు.
వ్యాయామానికి ముందు బాదం, కర్జూర తింటే శ్రేయస్కరం. అవి ఆక్సిజన్‌ అందించే సామర్థ్యాన్ని పెంచుతాయి.

తగ్గని క్రేజ్‌
వెయిట్‌లాస్‌, వెయిట్‌ గెయిన్‌ కోసం ఎక్కువగా జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇంకొంతమంది ఫిట్‌నెస్‌ కోసం వస్తున్నారు. మొత్తంగా జిమ్‌లలో పలురకాల పరికరాలతో కసరత్తు చేసి చెమటలు చిందిస్తున్నారు. కంప్యూటర్లపై పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. మహిళలు… ఎక్కువగా అధిక బరువు, థైరాయిడ్‌ లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు జిమ్‌లకు వెళ్తుంటారు.

వ్యాయామంలో మాస్క్‌ ధరించొద్దు
వ్యాయామం సమయంలో మాస్క్‌లు ధరించకూడదు. మాస్క్‌లు ధరించి వ్యాయామం చేస్తే నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ సరిపడా అందదు. శ్వాస సమస్యలు వస్తాయి.
-డాక్టర్‌ అనిల్‌, జనరల్‌ ఫిజీషియన్‌, నల్లగొండ

మాస్కు లేకుండానే జిమ్‌ చేయాలి
శారీక వ్యాయామంతోపాటు జిమ్‌ చేసే సమయంలో మాస్కు ధరించొద్దు. జిమ్‌ సెంటర్‌లో స్థలాన్ని బట్టి భౌతికదూరం పాటించాలి. వాకింగ్‌ చేసే సమయంలో కూడా మాస్క్‌ వాడకుండా ఉంటే మంచిది. కరోనా పరిస్థితిలో జిమ్‌. యోగా, శారీరక వ్యాయామాలు ఎంతో ఉపయోకరిస్తాయి.
-మహ్మద్‌ అస్రఫ్‌ అహ్మద్‌, జిమ్‌ ట్రైనర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, నల్లగొండ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాస్క్‌తో కసరత్తా! వద్దే వద్దు

ట్రెండింగ్‌

Advertisement