e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home జిల్లాలు అర్హులంతా టీకాలు వేయించుకోవాలి

అర్హులంతా టీకాలు వేయించుకోవాలి

అర్హులంతా టీకాలు వేయించుకోవాలి

చౌటుప్పల్‌, జూన్‌ 6: అర్హులైన వారందరూ కరోనా టీకా వే యించుకోవాలని అడిషనల్‌ కలెక్టర్‌ కిమ్యానాయక్‌ తెలిపారు. స్థానిక సీహెచ్‌సీలోని వాక్సినేషన్‌ సెంటర్‌ను ఆయన పరిశీలిం చారు. అనంతరం లింగోజిగూడెంలోని రైస్‌మిల్లును పరిశీలిం చి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటించా లన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించా రు. రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయా లన్నారు. ఆయన వెంట మండల వైద్యాధికారి డా. శివ ప్రసా ద్‌రెడ్డి, రెవిన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
కరోనా జాగ్రత్తలు పాటించాలి
ప్రతిఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ఏసీపీ సత్తయ్య, ట్రాఫిక్‌ ఏసీపీ శంకర్‌ అన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలో ఆది వారం ఆర్‌కేఎస్‌సీవలంటీర్లుకరోనాపై అవగాహన కల్పించారు.
వార్డుల్లో బ్లీచింగ్‌ చేయాలి: మున్సిపల్‌ చైర్మన్‌
భువనగిరి అర్బన్‌ : ప్రస్తుత కరోనా నేపథ్యంలో ప్రతి వార్డులో బ్లీచింగ్‌ చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నబోయిన ఆంజనే యులు మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని వార్డుల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను ఆదివారం పరిశీ లించారు. కరోనా నేపథ్యంలో వార్డుల్లో చెత్త కుప్పలు పేరుకు పోకుండా చూడాలన్నారు. డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తను ప్రతిరోజు తీసేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్మికులు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్కులు, సానిటైజర్లు వినియోగించుకోవాలని సూచించారు.
అడ్డగూడూరులో 21 మందికి వ్యాక్సిన్‌
అడ్డగూడూరు:మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో ఆది వారం 21 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని, అదేవి ధంగా 32 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చి నట్లు మండల వైధ్యాధికారి నరేశ్‌ తెలిపారు.
చేనేత కార్మికులకు సరుకులు పంపిణీ
ఆత్మకూరు(ఎం): కరోనా భారిన పడి ఇబ్బందులు పడుతున్న నిరుపేద చేనేత కార్మికులకు ఆదివారం మండలంలోని రాఘ వాపురంలో పద్మశాలి అఫీషియల్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌(పోపా) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బియ్యం, ని త్యావసరాలు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఉప్పలయ్య, శోభన్‌బాబు, సత్యనారాయణ పాల్గొన్నారు.
పోలీసులకు భోజనాలు
బొమ్మలరామారం: మండలంలోని రంగాపూర్‌ వద్ద పోలీసు సిబ్బందికి తిమ్మాపూర్‌కి చెందిన శాలివాహన సంఘం అధ్వ ర్యంలో ఆదివారం భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో సం ఘం సభ్యులు భాస్కర్‌ బాబు, నరసింహా, రాజు, మల్లేశ్‌, సం దీప్‌, ఉపసర్పంచ్‌ యాదగిరి ,పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు బాలనర్సింహ పాల్గొన్నారు.
నిత్యావసర సరుకులు పంపిణీ
బీబీనగర్‌: బీబీనగర్‌ మండల కేంద్రానికి చెందిన మారం సు జాతనర్సింహ రెడ్డి మనువరాలి జన్మదినం సందర్బంగా సర్పం చ్‌ భాగ్యలక్ష్మిశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవర ణలో పంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కోఅప్షన్‌ సభ్యులు అక్బర్‌, ఉపసర్పంచ్‌ దస్తగిరి, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షు డు నరేందర్‌, సమరసింహా రెడ్డి, స్వామి పాల్గొన్నారు.
ఆహార పాకెట్ల పంపిణీ
భువనగిరి అర్బన్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణంలోని 17వ వార్డు కౌన్సిలర్‌ చెన్న స్వాతి మహేశ్‌ సాయంతో పట్టణంలోని రైల్వే స్టేషన్‌, బష్టాండ్‌లలోని యాచకులు, కూలీలు, మెడికల్‌ సిబ్బందికి గాదె శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఆహార ప్యా కెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రవికాంత్‌, సోమేశ్వర్‌, సంకీర్త్‌, నరేశ్‌, ఆటో శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బందికి సన్మానం
ఆత్మకూరు(ఎం): కరోనా వైరస్‌ నివారణ కోసం నిరంతరం సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని ఆదివారం మండల కేం ద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీర్ల ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి చీరె లు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. కార్యక్రమంలో ఎం పీపీ మంగమ్మ, జడ్పీటీసీ నరేందర్‌గుప్తా, సర్పంచ్‌ నగేశ్‌, పీఏ సీఎస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ నవ్య, మాజీ సర్పంచ్‌ లక్ష్మారెడ్డితో పాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అర్హులంతా టీకాలు వేయించుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement