e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home నల్గొండ కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతం

కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతం

కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతం

గుర్రంపోడు, ఏప్రిల్‌ 2 : నాగర్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని లక్ష్మీదేవిగూడెం, కోయగూరోనిబావి, కొప్పోలు, బుడ్డారెడ్డిగూడెం, బొల్లారం, నడికుడ, ఆములూరు, చామలేడు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ సాగర్‌ అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ హయాంలో సాగర్‌ వెనుకబాటుకు గురైందని, జానారెడ్డిని ఏడు సార్లు గెలిపించినా ఏమీ ఒరగబెట్టలేదని విమర్శించారు. ఉప ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి మరోసారి వస్తున్నాడని, ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. దేశంలోనే మ్యానిఫెస్టో అమలు చేయడంతో పాటు హామీ ఇవ్వని పనులు, పథకాలెన్నో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నారని తెలిపారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ నలుమూలలకూ సాగు, తాగు నీటిని తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. 60ఏండ్ల ఆంధ్రా పాలకుల చేతుల్లో తెలంగాణ రైతాంగం మోసపోయిందని, వ్యవసాయం దండుగ అనే పరిస్థితి నుంచి పండుగలా మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు.

రైతు బంధు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంటు ఇచ్చిందని తెలిపారు. నోముల నర్సింహయ్య అకాల మరణం దురదృష్ణకరమని, చదువుకున్నవాడు, రేయింబవళ్లు పనిచేసే యువకుడైన భగత్‌ ద్వారానే సాగర్‌ అభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్‌ అవకాశం ఇచ్చారని తెలిపారు. ప్రజలంతా అభివృద్ధిని ఆశించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు మంత్రి జగదీశ్‌రెడ్డికి, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి భగత్‌కు ప్రజలు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. లక్ష్మీదేవిగూడెంలో బీజేపీ కార్యకర్తలు 30మంది మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌, చిరుమర్తి లింగయ్య, నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, పాశం గోపాల్‌రెడ్డి, ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, గజ్జెల చెన్నారెడ్డి, రామగిరి చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.

ఇవీ కూడా చదవండి..

అక్క‌డ ఒక్క‌రోజే 3,650 క‌రోనా మ‌ర‌ణాలు..!

పేషెంట్లకు లైంగిక వేధింపులు.. రూ.8 వేల కోట్ల పరిహారానికి ఆదేశం

అత్యంత ఘోర విమాన ప్రమాదం.. 583 మంది దుర్మరణం.. చరిత్రలో ఈరోజు

బంగ‌బంధు స‌మాధి వ‌ద్ద ప్ర‌ధాని మోదీ నివాళి

పేద దేశాలకు కోటి డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వండి : డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతం

ట్రెండింగ్‌

Advertisement