e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home నల్గొండ కరోనా పేషెంట్లకు చేయూత

కరోనా పేషెంట్లకు చేయూత

కరోనా పేషెంట్లకు చేయూత

నల్లగొండ రూరల్‌, జూన్‌ 1 : నల్లగొండ మండలంలోని అనంతారం గ్రామంలో కరోనా పేషెంట్లకు వైస్‌ ఎంపీపీ జిల్లేపల్లి పరమేశ్‌ మంగళవారం నిత్యావసర సరుకులతోపాటు, గుడ్లు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 40మందికి పైగా సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా టెస్టులకు వెళ్లలేని వృద్ధుల కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కొండ ఉమ, వార్డు సభ్యులు అరుణ్‌కుమార్‌, నాగరాజు, సైదులు, సునీత, రమేశ్‌, ఆశ కార్యకర్త శ్రీలత, పంచాయతీ సిబ్బంది రాంబాబు, మల్లేశ్‌ పాల్గొన్నారు.

శాలిగౌరారం : మండలంలోని మనిమద్దె, చిత్తలూరు, శాలిగౌరారం గ్రామాల్లో కరోనా పేషెంట్లకు ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత సహకారంతో ఎర్త్‌ లింక్స్‌ ఫౌండేషన్‌, న్యాయవాది వేముల అనుదీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో వేముల సతీశ్‌, భాస్కర్‌, జనార్దన్‌, నవీన్‌, సత్తి, వెంకటేశ్‌, సాయికుమార్‌ పాల్గొన్నారు.

క్షేత్రస్థాయిలో పనిచేయాలి మండల వైద్యాధికారి వెంకన్న
కరోనా కట్టడి కోసం ఆశ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పని చేయాలని శాలిగౌరారం మండల వైద్యాధికారి వెంకన్న కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా పేషెంట్లకు ఏవిధంగా వైద్యం చేయాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం కిట్లను అందజేశారు. అమర్‌, హెల్త్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ..
చిట్యాల : వనిపాకల గ్రామంలోని వీధుల్లో సర్పంచ్‌ మేడి లింగమ్మానర్సింహ సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేయించారు. వార్డు సభ్యులు మేడి ఉపేందర్‌, మారయ్య, లక్ష్మయ్య, నాగరాజు పాల్గొన్నారు.

అయ్యప్ప దేవస్థానం ఆధ్వర్యంలో..
రామగిరి : సమాజ సేవ అభినందనీయమని టూ టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని రామగిరిలో గల శ్రీహరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానం ఆధ్వర్యంలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కరోనా పేషెంట్లు, సహాయకులకు నిత్యం ఆహారం అందించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో టూటౌన్‌ ఎస్‌ఐ నర్సింహులు, ఆలయ ప్రధానార్చకుడు బి.మహేశ్‌శర్మ, గురుస్వాములు నోముల శ్యాం, అశోక్‌, దాతలు, భక్తులు పాల్గొన్నారు.

మునుగోడులో..
మునుగోడు : మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ప్రమోద్‌రెడ్డి, సాయి, వెంకన్న పాల్గొన్నారు. మునుగోడు ఉప సర్పంచ్‌ పందుల పవిత్ర-శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని చండూరు సీఐ సురేశ్‌ ప్రారంభించారు. ఎస్‌ఐ రజనీకర్‌, సర్పంచ్‌ మిర్యాల వెంకన్న, పంచాయతీ కార్యదర్శి మురళీమోహన్‌, గోవర్ధన్‌రెడ్డి, లింగస్వామి, నర్సింహ, సంపత్‌ పాల్గొన్నారు.

వీరేశం జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు..
కట్టంగూర్‌/ కేతేపల్లి/ శాలిగౌరారం/ చిట్యాల : నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే, ఉద్దీపన చైర్మన్‌ వేముల వీరేశం జన్మదినం సందర్భంగా వివిధ గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కట్టంగూర్‌లో ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, అభిమానులు కేక్‌ కట్‌ చేసి పేదలకు నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో కట్టంగూర్‌ ఎంపీటీసీ మాద యాదగిరి, నాయకులు బూరుగు శ్రీనువాస్‌, దార భిక్షం, గోశిక అంజన్‌కుమార్‌, గుండాల మల్లేశ్‌, మర్రి రాజు, మిట్టపల్లి శివకుమార్‌, గుండు పరమేశ్‌, మద్దెల శంకర్‌, గోగు బాలసైదులు, కానుగు శ్రీను, ధర్మారెడ్డి పాల్గొన్నారు.
కేతేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అన్నదానం చేశారు.

కరోనా పేషెంట్లకు కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్క్‌లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ గుత్తా మంజుల, సర్పంచులు జటంగి ముత్తమ్మ, ఎడ్ల పార్వతమ్మ, నాయకులు కె.వీరన్న, రమేశ్‌, ఎడ్ల ప్రవీణ్‌కుమార్‌, మట్టి సాల్మన్‌, బుద్దె కృష్ణ, వి.అఖిల్‌, ఎ.నరేశ్‌ పాల్గొన్నారు. శాలిగౌరారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో రోగులకు టీఆర్‌ఎస్వీ జిల్లా నాయకుడు షేక్‌ జాహంగీర్‌ ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి వెంకన్న బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సుల్తాన్‌ వెంకన్న, వేముల శ్రీకాంత్‌, నాగరాజు, సాయి, చీమల శ్రావణ్‌, గుండ్ల రవి, రవితేజ పాల్గొన్నారు. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో కరోనా పేషెంట్లకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి గ్లౌసులు, పండ్లు, శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఆవుల రమేశ్‌, వార్డు సభ్యులు హెచ్చు స్వామి, రూపని భిక్షం, పాకాల రవి, నందిపాటి అశోక్‌, ఆవుల సుందర్‌, సురేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా పేషెంట్లకు చేయూత

ట్రెండింగ్‌

Advertisement