e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు సర్పంచ్‌ ఔదార్యం..

సర్పంచ్‌ ఔదార్యం..

సర్పంచ్‌ ఔదార్యం..

యాదగిరిగుట్ట రూరల్‌, ఏప్రిల్‌ 30 : యాదగిరిగుట్ట మండ లం సైదాపురం గ్రామంలో మొట్టమొదటి సారిగా ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్‌ బీర్ల శంకర్‌ స్వత హాగా ముందుకు వచ్చి తన సొంత ఖర్చులతో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా శుక్రవా రం యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, మండల వైద్యాధికారి వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ప్రస్తుతం కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం చాలా ఉదృతంగా ఉందన్నారు. గ్రామాల్లో కొంతమందికి పాజిటివ్‌ వస్తే వారు ఇంట్లో ఉండడం కష్టంగా ఉందని ఇలాంటి వారికి గ్రామంలో ఐసొలేషన్‌ కేంద్రం ఉంటే చాలా సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఎక్కడా లేని విధంగా గ్రామ సర్పంచ్‌ స్వతహాగా ముందుకు వచ్చి గ్రామంలో ఐ సొలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీంతో గ్రామస్థులు ఎవరైనా కొవిడ్‌ బారినపడితే ఈ కేంద్రం లో ఉండవచ్చన్నారు.
గ్రామంలో ఎవరు ఇబ్బంది పడకూడదనే
తమ గ్రామంలో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ వస్తే వారు ఇం ట్లో ఉండడానికి ఇబ్బందులు ఉంటాయని గ్రామ సర్పంచ్‌ బీర్ల శంకర్‌ అన్నారు. ఇలాంటి భాదలు ఎవరూ ఎదుర్కోవద్దనే ఉద్దే శంతో గ్రామంలో ఒక ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల ని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలకు సెల వులు ఉన్నందున తరగతి గదులనే ఐసొలేషన్‌ కేంద్రంగా మా ర్చినట్లు చెప్పారు. గ్రామంలో చాలా మేరకు ఇండ్లలో వృద్ధులు, చిన్నపిల్లల ఉన్నారని, అదే ఇంట్లో ఎవరైనా కొవిడ్‌ బారిన పడి తే వారు ఇంట్లోనే ఉండడం కష్టమని గుర్తించి ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ఉండే కొవిడ్‌ బాధితులకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం అందజేస్తామన్నారు. జ్వరం చెక్‌ చేసుకోవడానికి థర్మామీటర్లు, ఆక్సిజన్‌ స్థాయిని పరిశీలించుకునేందుకు పల్స్‌ ఆక్సీమీటర్లు, ఆవిరి పీల్చుకోవడానికి ఆరు పరికరాలు, శానిటైజర్లు, లిక్విడ్స్‌, మాస్కులు అందించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రతి రోజు నాలుగు సార్లు గోరు వెచ్చని నీరు అందిస్తామన్నారు. ప్ర ధానంగా కరోనా పాజిటివ్‌ వచ్చిన వాళ్ళకు అందించే ప్రతి మా త్రను అందిస్తామన్నారు. ఐసొలేషన్‌ గది వద్ద తాగునీటి సౌక ర్యం ఉంటుందన్నారు. బాధితుల ఆరోగ్యస్థితిగతులను ప్రతి రోజూ యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, గ్రా మంలోని ఎఎన్‌ఎంలు పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. కార్య క్రమం ప్రారంభానికి ముందు యాదగిరిగుట్ట ఫైర్‌స్టేషన్‌ ఆధ్వ ర్యంలో గ్రామంలో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిం చారు. కార్యక్రమంలో ఎంపీవో చంద్రశేఖర్‌, ఫైర్‌స్టేషన్‌ అధి కారి చంద్రశేఖర్‌, వార్డుసభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సర్పంచ్‌ ఔదార్యం..

ట్రెండింగ్‌

Advertisement