రామగిరి: నల్లగొండలోని ఎన్జీ కళాశాలకు న్యాక్ గుర్తింపు కోసం వచ్చిన బృందం పర్యటన గురువారం ముగిసింది. రెండో రోజు తొలి రోజు చూసిన పలు అంశాలను తిరిగి పునః పరిశీలన చేశారు. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాలలో ఏర్పాటు చేసిన హరితహరంలో భాగంగా న్యాక్ పీర్ టీంలోని చైర్మన్, వీసీ కన్నూర్ యూనివర్సిటీ కేరళ, ప్రొ. గోపీనాథ్ రవీంద్రన్, మెంబర్ కోఆర్డినేటర్ జమ్ముకాశ్మీర్ సెంట్రర్ యూనివర్సిటీ ప్రొ.మహ్మద్ అఫ్జల్ జర్గార్, మెంబర్ సుగుణ కాలే జ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ తమిళనాడు ప్రిన్సిపాల్ ప్రొ. ఆర్.కితప్ప వైద్యనాథన్, పరిశీలకు పూర్వ యూజీసీ మెంబర్, ప్రొ. జి.గోపాల్‌రెడ్డిలు మొక్కలు నాటారు.
అనంతరం ఐక్యూఏసీ(ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరేన్స్ సెల్) కోఆర్డినేటర్ డైరెక్టర్, సభ్యులతో కళాశాలలో అంశాలపై చర్చిం చారు. అదేవిధంగా న్యాక్ టీం పరిశీలన చేసిన లోపాలను వెల్లడించి వాటిని సరిచేయాలని సూచించారు. తర్వాత కళాశా లలో న్యాక్ బృందం పరిశీలించిన అంశాలపై న్యాక్ ప్రధాన కార్యాలయానికి ఆన్లైన్లో ఎన్జీకి సంబంధించిన విషయాలను అంతర్గతంగా బృందం సభ్యులు నివేదికను సమర్పించారు. అదేవిధంగా ఆ నివేదికను సీల్డ్ కవర్లో ఎన్జీ కళాశాల ప్రిన్సిపా ల్ డా. చంద్రశేఖర్‌కు అందజేశారు. అదే విధంగా బోధన, భోదనేతర సిబ్బందితో ఎగ్జిట్(వీడ్కోల్) సమావేశాన్ని కళాశాల సమావేశ మందిరంలో సాయంత్రం నిర్వహించారు.
విద్యార్థినీ, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళా శాల బీఆర్‌ఏవోయూ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డా. బి.ధర్మానాయక్, కళాశాల సూపరింటెండెంట్ కోటేశ్, గ్రంథాల య శాస్త్ర అధ్యాపకుడు ఎ.దుర్గాప్రసాద్, ఎన్ఎస్ఎస్ పీవోలు ఈ.యాదగిరిరెడ్డి, నరసింహా, నాగుల వేణు, సంధ్య, సీఈవో నాగరాజు, తెలుగు విభాగం అధ్యాపకులు డా. తండు కృష్ణకౌండిన్య, వివిధ విభాగాల హెచ్వోడీలు భిక్షమయ్య, మునీరోద్దీ న్, నందకుమార్, పీడీ కడారి మల్లేశ్, ఎన్ సీసీ క్యాడెట్స్, విద్యార్థులు బోధన, భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు.
త్వరలో తేలనున్న భవితవ్యం
న్యాక్ బృందం సమర్పించిన నివేదికలోని అంశాలను న్యాక్ ప్రధాన కార్యాయలంలో పరిశీలన చేస్తారు. నివేదికలోని అంశాల ఆధారంగానే త్వరలోనే కళాశాలకు న్యాక్ గ్రేడ్ ఏదీ అనేది వెల్లడికానుంది. న్యాక్ గ్రేడ్ నిర్ణయమైన తర్వాతనే ప్రిన్సిపాల్‌కు న్యాక్ బృందం సభ్యులు అందించిన నివేదిక సీల్డ్ కవర్‌ను తేరవాల్సి ఉంటుంది. బృందం సూచించిన గ్రేడ్ ఏమీటో చూడాలంటే ఫలితం వచ్చే వరకు ఆగాల్సిందే.