e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News డీజే ఆపించాడని ట్రైనీ ఎస్‌ఐపై దాడి.. 10 మంది యువకులపై కేసు

డీజే ఆపించాడని ట్రైనీ ఎస్‌ఐపై దాడి.. 10 మంది యువకులపై కేసు

డీజే ఆపించాడని ట్రైనీ ఎస్‌ఐపై దాడి.. 10 మంది యువకులపై కేసు

నల్లగొండ : నల్లగొండ జిల్లాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. లాక్‌డౌన్‌ సమయంలో అర్ధరాత్రి డీజే పెట్టి చిందేస్తున్న యువతను అడ్డుకున్న ట్రైనీ ఎస్‌ఐపై దాడి జరిగింది. డిండి మండలం బురాన్‌పూర్‌ తండాలో ఈ ఉదంతం జరగ్గా ఉదయం వెలుగులోకి వచ్చింది. పెట్రోలింగ్‌లో భాగంగా రాత్రి సిబ్బందితో కలిసి ట్రైనీ ఎస్‌ఐ కిరణ్‌ బురాన్‌పూర్‌ తండాకు వెళ్లాడు. స్థానికంగా వివాహ వేడుకలో డీజేలతో యువకులు గుంపులుగా నృత్యాలు చేస్తుండటంతో అనుమతి లేదని ట్రైనీ ఎస్‌ఐ కిరణ్‌ డీజేను ఆపించాడు. దీంతో ఎస్‌ఐ కిరణ్‌పై యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వారిని చెదరగొట్టారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దాడి చేయడంతో 10 మంది యువకులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డీజే ఆపించాడని ట్రైనీ ఎస్‌ఐపై దాడి.. 10 మంది యువకులపై కేసు
డీజే ఆపించాడని ట్రైనీ ఎస్‌ఐపై దాడి.. 10 మంది యువకులపై కేసు
డీజే ఆపించాడని ట్రైనీ ఎస్‌ఐపై దాడి.. 10 మంది యువకులపై కేసు

ట్రెండింగ్‌

Advertisement