e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా గురువారం తెల్లవారుజాము నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నాంపల్లి, చింతపల్లి, డిండి, నిడమనూరు, హుజూర్‌నగర్‌, మునుగోడు, యాదగిరిగుట్ట, మఠంపల్లి, పాలకవీడు, చిట్యాల, తిరుమలగిరి, గరిడేపల్లి, మిర్యాలగూడ, పీఏపల్లి, తుంగతుర్తి, వలిగొండ, ఆత్మకూర్(ఎస్‌), సూర్యాపేట, నూతన్‌కల్‌, హాలియా, అడవిదేవులపల్లి, నల్లగొండ, పెద్దవూర, అడ్డగూడూరు మండలాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

నాంపల్లి మండలం జాన్‌ తండా వద్ద శేషిలేటి వాగుకు వరద పొటెత్తుతున్నది. మునుగోడు మండలం జమస్థాన్‌పల్లిలో పిడుగుపాటుకు 2 పశువులు మృత్యువాతపడ్డాయి. ఈ సారి మృగశిర కార్తెకు ముందే వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ట్రెండింగ్‌

Advertisement